ఇదేం అభిమానం తల్లీ.. జపాన్​లో NTR కటౌట్​కు లేడీ ఫ్యాన్స్ పూజలు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR)కు ఇండియాలోనే కాదు జపాన్ లోనూ సూపర్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలకు అక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల సమయంలో జపనీస్ అభిమానులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆ సినిమా ఇండియాలోనే కాదు జపాన్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్. ఇక ఎన్టీఆర్ సినిమాలేం వచ్చినా.. సబ్ టైటిల్స్ తో చూడటం జపనీస్ ఫ్యాన్స్ కు అలవాటు. అయితే ఈసారి వాళ్లు ఆ కష్టం పడకుండా.. తారక్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర(Devara)’ను జపాన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

జపాన్ లో దేవర మేనియా

కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది. అయితే జపాన్ లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ చూసి మేకర్స్ దేవరను అక్కడ కూడా విడుదల చేయాలని భావించారు. మార్చి 27వ తేదీన ఈ సినిమా జపాన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. అయితే సినిమా రిలీజ్ కు ముందు అక్కడ దేవర ప్రీమియర్స్ వేసినట్లు సమాచారం.

దేవరపై జపనీస్ లేడీ ఫ్యాన్స్ లవ్

దేవర ప్రీమియర్స్(Devara Premier in Japan) కు జపనీస్ లేడీ ఫ్యాన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన లేడీ ఫ్యాన్స్ ఏకంగా ఎన్టీఆర్ కటౌట్ కు పూజలు చేశారు. కటౌట్ చుట్టూ కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూలతో నింపిన ఓ బ్యానర్​ను జారవిడిచి  ఎన్​టీఆర్​ పట్ల తమకున్న ప్రేమను చాటారు. మరో వీడియోలో తారక్ కటౌట్ చుట్టూ అమ్మాయిలంతా చేరి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలు చూసిన తారక్ ఫ్యాన్స్.. ఎన్టీఆరా మజాకా.. జపాన్ లోనూ యంగ్ టైగర్ హవా అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *