ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు మళ్లీ చేసుకోనున్నాడు. దీనికి అక్షరాల రూ. 5 వేల కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. అతి తక్కువ మంది సెలబ్రెటీల ముందు తాను రెండో పెళ్లి అంగరంగ వైభవంగా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. జెఫ్ బెజోస్ (Jeff Bezos) తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ (Lauren Sanchez) తో పెళ్లికి సిద్ధమయ్యారు. గతేడాది నిశ్చితార్ధం చేసుకోగా.. కొలరాడోలోని ఆస్పెన్ (Aspen) లో సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఈ నెల 28న వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
బిల్ గేట్స్ (Bill Gates), లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio), జోర్డాన్ రాణి రానియా (Rania Al Abdullah) వంటి ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. దాదాపు 180 మంది పాల్గొనే ఈ వేడుక కోసం ఓ విలాసవంతమైన రెస్టారెంట్ అద్దెకు తీసుకున్నట్లు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ పెళ్లి వేడుకకు వచ్చే సెలబ్రెటీల కోసం లగ్జరీ హోటల్స్, ప్రైవేటు ప్రత్యేక రూమ్స్ ముందస్తు బుకింగ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా వివాహ వేడుక కోసం దాదాపు 600 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. అంటే దాదాపు ఇండియా రూపాయలు 5 వేల కోట్లకు పైనే.
జెఫ్ బెజోస్ (Jeff Bezos), లారెన్లు 2018 నుంచే డేటింగ్ లో ఉన్నట్లు పుకార్లు వచ్చినా… 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్ తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మెకంజీతో ఆయనకు నలుగురు సంతానం ఉన్నారు. గతేడాది మే నెలలో బెజోస్, లారెన్ నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా 2.5 మిలియన్ డాలర్ల వజ్రాల ఉంగరాన్ని శాంజెస్ కు జోస్ ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. 54 ఏళ్ల లారెన్ గతంలో జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం ఆమె సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన దాతృత్వాన్ని చాటుకుంటోంది. ప్రపంచలోనే అత్యంత ధనవంతులైన.. టాప్ 10 కుబేరుల జాబితాలో ఒకరుగా నిలిచిన జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్. ఈయన నికర విలువ 2024 నవంబర్ 13 నాటికి 230 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం.. 1,94,17,68,88,43,000. లక్షల కోట్లు అని తెలుస్తోంది.







