
రాష్ట్రంలో మరో ఉపఎన్నిక(By Elections)కు అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష BRS పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్(JubileeHills) బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక(Jubilee Hills Bypoll)పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి(Chief Electoral Officer Sudarshan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల
దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ(Election Commission) ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఖాళీ అయినట్లు తమకు గెజిట్(Gazette) వచ్చిందన్నారు. దాన్ని తాము కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు వివరించారు. అయితే.. డిసెంబర్ లోగా ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉందన్నారు.
Jubilee Hills bypoll to be held before December, confirms Telangana CEO. Political prep underway. New polling rules also announced.#JubileeHillsBypoll #TelanganaElections #VoterIDUpdateshttps://t.co/z9zI8zrpTb
— Hyderabad News Hunt (@hydnewshunt) June 17, 2025
బలమైన అభ్యర్థి కోసం పార్టీల వెతుకులాట
కాగా గత ఎన్నికల్లో ఆయన BRS విజయం సాధించింది. దీంతో మరో సారి తమ సిట్టింగ్ సీటును దక్కించుకోవాలని గులాబీ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు ప్రారంభించింది. మాగంటి కుటుంబం నుంచే ఆ పార్టీ అభ్యర్థిని పోటీలోకి దించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా ఎలాగైనా జూబ్లీహిల్స్(JubileeHills)లో ఈ సారి విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో క్రికెటర్ అజారుద్దీన్ (Azharuddin)కు టికెట్ ఇచ్చిన ఆ పార్టీ.. ఈసారి కొత్త అభ్యర్థి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అటు BJP కూడా ఈ ఉపఎన్నికను సీరియస్‌గానే తీసుకునే ఛాన్సుంది. మొత్తంగా మూడు పార్టీలు బలమైన అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించినట్లు సమాచారం.