ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-4 పోటీల కాంపౌండ్ విభాగంలో భారత మహిళలు, పురుషుల జట్లు ఫైనల్స్‌కు దూసుకెళ్లి కనీసం రజత పతకాలు ఖరారు చేసుకున్నాయి.
పారిస్: ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-4 పోటీల కాంపౌండ్ విభాగంలో భారత మహిళలు, పురుషుల జట్లు ఫైనల్స్‌కు దూసుకెళ్లి కనీసం రజత పతకాలు ఖరారు చేసుకున్నాయి. బుధవారం జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ సెమీస్‌లో వెన్నం జ్యోతి సురేఖ, అదితి, పర్నీత్ కౌర్‌లతో కూడిన బృందం 234-233తో బ్రిటన్‌పై నెగ్గింది. టాప్ సీడ్ జ్యోతి త్రయం ఫైనల్లో మెక్సికోతో తలపడనుంది.
పురుషుల టీమ్ ఈవెంట్ సెమీస్‌లో ఓజాస్ ప్రవీణ్ డియోటలే, ప్రథమేష్, అభిషేక్ వర్మలతో కూడిన భారత జట్టు కొరియాపై గెలిచింది. తొలుత 235-235తో ఇరు జట్ల స్కోర్లు సమం కాగా, అనంతరం షుటౌట్‌లోనూ 30-30తో టై అయింది. దీంతో రెఫరీలు బుల్ ఐకి దగ్గరగా విల్లులు సంధించిన భారత బృందాన్ని విజేతగా ప్రకటించారు. స్వర్ణ పోరులో అమెరికాను భారత జట్టు ఢీకొననుంది.