
నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయశాంతి (Vijay Santhi) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా సందడి చేస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ (Sohail Khan) మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.
పవర్ ఫుల్ డైలాగ్స్
అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. కల్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఈ ఇద్దరు పవర్‌ఫుల్ డైలాగ్‌లతో టీజర్ ఆకట్టుకుంటోంది. మరి ఎంతో పవర్ ఫుల్ గా సాగిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ (Arjun Son Of Vyjayanthi Teaser)ను మీరూ ఓ చూసేయండి.
అర్జున్ విశ్వనాథ్ ఆన్ ఫైర్
’10 సంవత్సరాల నా కెరియర్ లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్.. కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతిసారి నా కళ్ల ముందు కనిపించే ముఖం.. నా కొడుకు అర్జున్’… ‘నేను డ్యూటీలో ఉన్నా లేకపోయినా.. చచ్చింది శత్రువైనా.. చంపింది బంధువైనా.. నా కళ్ల ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు.’ అంటూ విజయశాంతి చెప్పిన డైలాగ్స్ టీజర్ కే హైలైట్ గా నిలిచాయి. ఇక రేపటి నుంచి వైజాగ్ ను పోలీస్ బూట్లు, నల్లకోట్లు కాదు.. ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయ్ అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
తల్లీకొడుకుల బంధం
ఇక ఈ సినిమా తల్లీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. అదేవిధంగా సొసైటీలో జరుగుతున్న అన్యాయాన్ని ధర్మంగా ఎదిరించే పాత్రల్లో కళ్యాణ్ రామ్, విజయశాంతి కనిపించనున్నట్లు టీజర్ లో కనిపించింది. అశోకా క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక శ్రీకాంత్, పృథ్వీ వంటి నటులు కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు.