నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా (Kalyan Ram), లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijaya Shanthi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘అర్జున్ S/o వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi). బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్(Saiee Manjrekar) హీరోయిన్గా కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ (Sohail Khan) మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. న్యూ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ శనివారం రాత్రి గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) చీఫ్ గెస్టుగా హాజరై ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
MAN OF MASSES @tarak9999 makes a power-packed entry 🔥 at the #ArjunSonOfVyjayanthi pre-release event.
GRAND RELEASE WORLDWIDE ON APRIL 18th, 2025.@NANDAMURIKALYAN @vijayashanthi_m @saieemmanjrekar @SohailKhan @Dirpradeepch @SunilBalusu1981 @muppaav… pic.twitter.com/KfvkOWbYQ1
— Aditya Music (@adityamusic) April 12, 2025
IPS ఆఫీసర్‌గా విజయశాంతి
ఇక చాలా రోజుల తర్వాత విజయశాంతి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను పరిశీలిస్తే, విజయశాంతి ఓ IPS ఆఫీసర్‌గా కనిపించారు. ఆమె కుమారుడిగా కళ్యాణ్ రామ్ అర్జున్(Arjun) పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక వీరిద్దరి మధ్య ఒక మనస్పర్ధ కారణంగా దూరం పెరుగుతుందని, విజయశాంతి చట్టం ప్రకారం శిక్షించాలని ప్రయత్నిస్తుంటే, అర్జున్ తనదైన చట్టం చేసుకుంటూ ఎవరినైతే పడితే వారిని శిక్షిస్తూ ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది.
ఏప్రిల్ 18న థియేటర్లలోకి..
మొత్తం మీద ట్రైలర్ కట్ సినిమా మీద ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ APRIL 18న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్(Realese) కానుంది. ఈ ఇద్దరు పవర్ఫుల్ డైలాగ్‌ల(Powerful Dialogues)తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రైలర్‌ని చూసేయండి.








