అమెరికాలో మళ్లీ కాల్పులు.. కమలా హారిస్‌ ప్రచార కార్యాలయంపై దాడి

ManaEnadu : అమెరికాలో నవంబరులో అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections 2024) జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులైన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారం వేళ అధ్యక్ష అభ్యర్థులపై దాడులు అమెరికాలో కలకలం రేపుతున్నాయి. ఇటీవలే ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)​పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న ఆయనపై నాలుగు రోజుల క్రితం మరో హత్యాయత్నాన్ని సీక్రెట్ ఏజెంట్లు భగ్నం చేశారు.

హారిస్ ఆఫీస్​పై కాల్పులు

ఇక తాజాగా డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ (Kamala Harris) పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు అర్థరాత్రి తుపాకులతో దాడులకు తెగబడ్డారు. అరిజోనాలోని డెమోక్రటిక్‌ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై కాల్పులు జరిపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కార్యాలయం కిటికీల వద్ద నుంచి కాల్పులు (Kamala Harris Office Gunfire) జరిపినట్లు గుర్తించారు. అర్థరాత్రి సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు.

ముందంజలో కమలా హారిస్

మరోవైపు, అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌, డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆసియన్‌ అమెరికన్‌ ఓటర్లలో 38 పాయింట్లతో ముందజలో ఉన్నట్లు తాజా సర్వేలు (US Poll Survey) తెలిపాయి. చికాగో విశ్వవిద్యాలయంలో ఎన్‌ఓఆర్‌సీ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఆసియా అమెరికన్‌ (Asia American Voters) ఓటర్లలో 66 శాతం మంది హారిస్‌కు మద్దతుగా నిలిచారు. ట్రంప్‌నకు మద్దతుగా కేవలం 28 శాతం మంది నిలవడం గమనార్హం.

ట్రంప్​పై రెండు సార్లు హత్యాయత్నం

ఇక జులై 14వ తేదీన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump Assassination Attempt)పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. పెన్సిల్వేనియాలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరపగా ఆయన కుడిచెవికి బుల్లెట్‌ తగిలి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ట్రంప్‌ను సురక్షితంగా వేదికపై నుంచి తరలించారు. మరోవైపు ఈనెల 16వ తేదీన ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లోని తన గోల్ఫ్‌ కోర్టులో ట్రంప్‌ గోల్ఫ్‌ (Trump Golf Court Gunfire) ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీని ట్రంప్​వైపు గురి పెట్టాడు. గమనించిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అతడిపై కాల్పులు జరిపి పట్టుకున్నారు. ఇలా అధ్యక్ష అభ్యర్థులపై వరుస దాడుల ఘటనలు అమెరికాలో కలకలం రేపుతున్నాయి.

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *