Mana Enadu: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువ'(Kanguva). ప్రముఖ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. యానిమల్ నటుడు బాబీ డియోల్(Bobby Deol)మరోసారి విలన్ రోల్‌లో కనిపిస్తున్నాడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్(UV Creations) బ్యానర్లపై ప్రొడ్యూసర్లు జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు దాదాపు 300 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 36 భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. వచ్చే నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సముద్రంలో సాగే యాక్షన్ సీన్స్ హైలైట్
కాగా దసరా కానుకగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ట్రైలర్(Trailer)ను విడుదల చేశారు. రెండు తెగల మధ్య సాగే పోరాటాన్ని అద్భుత మైన యాక్షన్ సీక్వెన్స్ జోడించి శివ ఈ సినిమాను తెరకెక్కించాడు. మొయిన్‌గా సముద్రంలో సాగే యాక్షన్ సీన్స్ మూవీకే హైలైట్‌గా ఉన్నాయి. ఇక స్టార్ హీరో సూర్య తన మేనరిజాన్ని కంటిన్యూ చేశాడు. ఫైట్స్ సీన్స్‌లో అయితే సూర్య యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తన అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేశాడు.
ఫైనల్ రన్‌టైం ఎంతంటే..
తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆంథమ్ లిరికల్ వీడియో(Anthem Lyrical Video)ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. తలైవనే అంటూ సాగుతున్న ఈ పాట గూస్‌బంప్స్ తెప్పిస్తోందని సూర్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్(DSP) ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. కాగా కంగువ సినిమాకు CBFC సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసింది. సినిమాలో పలు సవరణలు సూచించిన సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక కంగువ ఫైనల్ రన్‌టైం 2 గంటల 34 నిమిషాలు. యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్‌ను ఈ నిడివి పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తుందని సినీ వర్గాల్లో టాక్.
All hail his glory! All chant his name! #Kanguva 🦅
The King's Anthem, #Thalaivane 🔥 OUT NOW
▶️ https://t.co/QDW5tbfjKJA @ThisIsDSP Musical
A @madhankarky Lyrical #KanguvaFromNov14 🗡️@Suriya_offl @thedeol @directorsiva @DishPatani @StudioGreen2 @gnanavelraja007… pic.twitter.com/hj3xWFBzcW— Kanguva (@KanguvaTheMovie) October 29, 2024






