భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో తెరకెక్కుతోన్నచిత్రం ‘కన్నప్ప’. భక్తికి గొప్ప స్థానం ఇచ్చే కథా ఆధారంగా చేసుకుని పాన్ ఇండియా చిత్రంగా.. శ్రీశైలానికి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ప్రాంతంలో జరిగిన త్యాగ ఘట్టాన్ని ఆధారంగా తీసుకుని రూపొందుతోంది. క్షత్రియుడిగా జన్మించి, శివభక్తుడిగా మారిన ‘కన్నప్ప’ జీవిత గాధను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారు. విజువల్స్ పరంగా ఈ చిత్రం అత్యున్నత స్థాయి విలువలతో రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి కీలక అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. కన్నప్ప ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు.
ఈ పోస్టర్‌తో పాటు క్యాప్షన్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. “విశ్వాసం.. అగ్ని.. ఉగ్రత. జూన్ 13న ఆ దివ్య యోధుడి పిలుపు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. కన్నప్ప ట్రైలర్ ఉరుములతో వస్తుంది. మరెవరికీ లేని భక్తుడి గాథను చూడటానికి సిద్ధంగా ఉండండి. హర్ హర్ మహాదేవ్.. హర్ ఘర్ మహాదేవ్” అంటూ కొత్త పోస్టర్ విడుదల చేస్తూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్ కోసం మంచు విష్ణు అభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌కు వేగం పెంచారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రీ రిలీజ్ ఈవెంట్, విష్ణు వరుస ఇంటర్వ్యూలు సినిమాపై హైప్‌ను పెంచుతున్నాయి. త్వరలో ప్రభాస్ కూడా ప్రమోషన్స్‌లో పాల్గొననున్నారు.
ప్రముఖ కవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప కథను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ, స్క్రీన్ ప్లేను మంచు విష్ణు స్వయంగా అందించగా, మహాభారత టీవీ సిరీస్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
🌪️ Faith. Fire. Fierceness.
The divine warrior’s call will echo across the world on 13th June.
💥 The trailer of Kannappa arrives with thunder.
Get ready to witness the saga of a devotee like no other.Har Har Mahadev 🔱
Har Ghar Mahadev 🔥#Kannappa27thJune #KannappaMovie… pic.twitter.com/U7bXZd5yZQ— Kannappa The Movie (@kannappamovie) June 10, 2025
ఈ సినిమాలో టైటిల్ పాత్రలో విష్ణు మంచు నటిస్తుండగా, నిర్మాతగా మోహన్ బాబు వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో పలు ఇండస్ట్రీల టాప్ స్టార్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శరత్ కుమార్, మోహన్ బాబు ,శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటించగా.. ప్రభాస్ రుద్రుడిగా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు






