Kantha: ‘కాంత’ పోస్టర్ రివిల్.. ఆకట్టుకుంటున్న భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్

తెలుగులో మహానటి, సీతారామం, లక్మీ భాస్కర్ వంటి మూవీలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడంతో అతడికి టాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్ బేస్ దక్కింది. దీంతో తెలుగులో వరుసబెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. తాజాగా ‘కాంత(Kantha)’ అనే సినిమా చేస్తున్నాడు. దీనిని కొత్త డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో దుల్కర్‌కు జంటగా భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ పోస్టర్‌ను రివిల్ చేశారు.

‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్‌ ఎంట్రీ

‘మిస్టర్ బచ్చన్(Mister Bacchan)’తో ఫేమ్ తెచ్చకున్న భాగ్యశ్రీ తాజాగా ‘కాంత’ మూవీలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన భాగ్యశ్రీ బోర్సే లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో సంప్రదాయ వస్త్రధారణలో లూజ్ హెయిర్‌తో ఆమె కనిపిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్(Selvamani Selvaraj) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 1950 నాటి కాలంలో మద్రాస్ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్నట్లు సమాచారం. ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ ప్రస్తుతం ‘కాంత’తో పాటు RAPO22, కింగ్‌డమ్ సినిమాల్లో నటిస్తోంది.

కాగా కాంత సినిమాను స్పిరిట్ మీడియా(Sprti Media), వే ఫియర్ బ్యానర్స్‌పై టాలీవుడ్ ప్రముఖ హీరో, సినీ నిర్మాత రానా దగ్గుబాటి(Rana Daggubati)తో కలిసి దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయనున్నారట.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *