
నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు((KTR Birth Day) . ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, సన్నిహితుల నుంచి సోషల్ మీడియా(Social Media) వేదికగా బర్త్ డే విషెస్(Wishes) వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కూడా ఆయనకు ‘X’ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “అన్నయ్యా.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!”(Annayya
Many Happy Returns of the day!! @KTRBRS) అని ట్వీట్ చేస్తూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.
Annayya
Many Happy Returns of the day!! @KTRBRS— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 24, 2025
KTR, కవిత మధ్య గ్యాప్.. కారణం అదేనా?
కాగా, ఇటీవల BRS అధినేత, మాజీ సీఎం KCRకు లేఖ నేపథ్యంలో KTR, కవిత మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగిన విషయం తెలిసిందే. అలాగే కొంతకాలంగా కవిత, కేటీఆర్‌ల మధ్య సంబంధాలు సరిగా లేవని ప్రచారం జరుగుతుంది. కవిత సొంత పార్టీ బీఆర్ఎస్ విధానాలను విమర్శిస్తూ కేసీఆర్‌కు లేఖ రాయడం.. ఆపై పార్టీలోని వ్యక్తులు తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించడం వంటివి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వివాదాస్పదంగా నిలిచాయి. ఈ క్రమంలో కవిత తాజాగా కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.