
హీరో నితిన్(Nitin) హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్(Rabinhood). వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహించారు. శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. GV ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో రెండు పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈరోజు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
“ది హాటెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ది ఇయర్(The Hottest Surprise of the Year)” గా సిజ్లింగ్ దివా కేతికా శర్మ(Ketika Sharma) నటించిన స్పెషల్ సాంగ్(Special Song) మార్చి 10న విడుదల కానుంది. ఈ ట్రాక్‌లో కేతికా శర్మ అల్ట్రా గ్లామరస్‌గా కనిపించనుంది. ఇది ప్రేక్షకులను, సంగీత ప్రియులను సర్ ప్రైజ్ చేయబోతోంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్(Poster)లో కేతిక శర్మ గ్లామరస్ లుక్ ఆకట్టుకుంది.
The Hottest Song Of The Year- Ketika Sharma’s Special Song In Nithiin, Venky Kudumula, Mythri Movie Makers’ Robinhood Releasing On March 10th#Robinhood #KetikaSharma #Nithiin #Sreeleela pic.twitter.com/jqldwEce56
— Pallavi Media (@pallavimedia) March 7, 2025
మార్చి 28న థియేటర్లలోకి..
బోల్డ్, స్టన్నింగ్ పెర్ఫామెన్స్‌లతో ఆకట్టుకునే కేతిక శర్మ ఈ సాంగ్‌లో అదరగొట్టబోతోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ బ్యుటీఫుల్ సినిమాటోగ్రఫీని అందించారు. కోటి ఎడిటర్‌గా పనిచేస్తుండగా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్(Rajendraprasas), వెన్నెల కిషోర్(Vennela Kishore) కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.