
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ (The Paradise), హిట్ 3 : ది థర్డ్ కేసు (HIT : The Third Case) సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో వరుసగా సినిమాలు నిర్మిస్తూ అటు హీరోగా.. ఇటు నిర్మాతగా తీరికలేకుండా గడుపుతున్నారు. తాజాగా ఆయన నిర్మాణంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కోర్ట్ : స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ (Court: State vs A Nobody).
మార్చి 14న కోర్టు రిలీజ్
రామ్ జగదీశ్ (Ram Jagadish) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శితో పాటు హర్ష్ రోషన్, శ్రీదేవి నటిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత నాని(Nani)తో పాటు దర్శకులు ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెల, మోహనకృష్ణ ఇంద్రగంటి, నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. కోర్టు చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.
Watch this film on 14th.
I promise you an experience you will take back home.
Till 14th we promote and I am confident your word will do it from that day.We proudly give you #Court TRAILER https://t.co/LC8SgMvaEU#CourtStateVsANobody pic.twitter.com/0cULtcYTrC
— Nani (@NameisNani) March 7, 2025
కోర్టు చూడకపోతే హిట్-3 చూడొద్దు
అయితే ఈ వేడుకలో నాని మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 14న రిలీజ్ కాబోతున్న కోర్ట్ సినిమా నచ్చకపోతే మరో రెండు నెలల్లో రానున్న హిట్-3 మూవీని చూడ్డానికి రావొద్దని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు నాని. ‘కోర్టు సినిమాను అస్సలు మిస్ అవ్వొద్దు. నా 16 ఏళ్ల సినిమా కెరీర్ లో ఒక వేదికపైకి వచ్చి దయచేసి నా సినిమా చూడండి అని నేనెప్పుడూ అడగలేదు. కానీ కోర్టు సినిమా చూడమని కోరుకుంటున్నాను. ఓ నిర్మాతగా ఈ మాట చెప్పడం లేదు. సినిమాను ఇష్టపడే, మంచి చిత్రాన్ని ఆదరించే సగడు ప్రేక్షకుడిగా చెబుతున్నాను.’ అని నాని తెలిపారు.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…