OTT: ‘కింగ్‌డమ్’ మూవీ.. ఓటిటీలో విడుదల ఎప్పుడంటే?

విజయ్ దేవరకొండ(Vijay devarakonda) తాజా చిత్రం “కింగ్డమ్”(Kingdom), దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా జూలై 28na ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ‌కు గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవటంతో, కింగ్డమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇకపోతే, సినిమా విడుదలైన వెంటనే ఓటిటి ప్లాట్‌ఫారమ్‌పై స్ట్రీమింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ఆసక్తి మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, “కింగ్డమ్” సినిమా ఎనిమిది వారాల థియేట్రికల్ రన్ తర్వాత ప్రముఖ ఓటిటి(OTT) ప్లాట్‌ఫారమ్ అయిన నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంటే సెప్టెంబర్ చివర లేదా అక్టోబర్ మొదట్లో ఈ సినిమా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం ఇప్పుడే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనితో విజయ్ మళ్లీ ఫామ్‌లోకి వస్తున్నాడనే నమ్మకం అభిమానుల్లో నెలకొంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *