
IPL-2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) తొలి విజయం నమోదు చేసింది. గువహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్(RR)తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. KKR విక్టరీలో ఓపెనర్ క్వింటన్ డికాక్(Quinton de Kock) కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన డికాక్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. 60 బంతులు ఎదుర్కొన్న డికాక్.. (8ఫోర్లు, 5 సిక్స్‌లతో 97 రన్స్) చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు రఘువంశీ(22), రహానే(18) పరుగులతో రాణించారు. RR బౌలర్లలో హసరంగా ఒక్కడే ఓ వికెట్ సాధించగా.. మరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది.
RR బ్యాటర్లు విఫలం
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన RR నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. KKR స్పిన్నర్ల దాటికి RR బ్యాటర్లు విలవిలలాడారు. రైడర్స్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు సాధించారు. RR బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వీ జైస్వాల్(29), రియాన్ పరాగ్(25) పరుగులతో రాణించారు. కాగా RRకి ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం.
నేడు SRH vs LSG
ఇక ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్(SRH) వర్సెస్ లక్నో సూపర్ జైయింట్స్(LSG) మధ్య రాత్రి మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి 7.30 గంటల నుంచి మ్యాచ్ జరుగుతుంది. కాగా ఉప్పల్ స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో ఈ మ్యాచులోనూ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. కాగా గత మ్యాచులో రెండు జట్లు 200 పైచిలుకు పరుగులు సాధించిన విషయం తెలిసిందే. మరి మ్యాచులోనైనా SRH 300 రన్స్ చేస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.