
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో షాక్ తగిలింది. తొలి మ్యాచులో ఘన విజయం సాధించిన ఆ జట్టు ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఘోర ఓటమిని చవిచూసింది. గురువారం డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో SRH 80 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటోమితో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలోనూ అట్టడుగు స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం నాలుగు మ్యాచులు ఆడిన సన్ రైజర్స్ 2 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతోంది.
అయ్యర్ అదరహో..
కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత టాస్ ఓడి టాస్ బ్యాటింగ్ చేసిన KKR 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ (29 బంతుల్లో 60 పరుగుల)తో వీరవిహారం చేశాడు. అతడికి తోడు అంగ్క్రిష్ రఘువంశీ (32 బంతుల్లో 50 పరుగుల)తో విజృంభించాడు. అంతకుముందు కెప్టెన్ అజింక్య రహానే 38, రింకూ సింగ్ అజేయంగా (32) రన్స్ చేయడంతో కేకేఆర్ భారీ స్కోరు సాధించింది. SRH బౌలర్లలో కమిన్స్, షమీ, హర్షల్, అన్సారీ, కమిందు తలో వికెట్ట్ పడగొట్టారు.
KKRs 2 big big hopes – Rinku Singh and Venkatesh Iyer were absolutely sensational today during their 91 run partnership !!
They scored 82 in the last 30 balls !!! 💥💥💥#KKRvSRH #KKRvsSRH
— Cricketism (@MidnightMusinng) April 3, 2025
ఆ నలుగురు మినహా..
అనంతరం 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో SRH 16.3 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలిది. ఆ జట్టులో హెన్రిచ్ క్లాసెన్ (33) పరుగులు, కమిందు మెండిస్ (27), నితీశ్ కుమార్ (19), కమిన్స్ (14) రన్స్ మినహా బ్యాటర్లంతా సింగిలి డిజిట్‌కే పరిమితమయ్యారు. KKR బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా చెరో 3 వికెట్లు తీశారు. రస్సెల్‌కు 2 వికెట్లు దక్కాయి. వైభవ్ అరోరాకు “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్” దక్కింది.