రజనీ, కమల్, అజిత్, విజయ్.. అప్పుడలా ఇప్పుడిలా

సోషల్ మీడియాలో రోజుకో ట్రెండ్ వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో చేసిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఏఐ సాయంతో మనకు నచ్చిన సెలబ్రిటీలను నచ్చిన వేషధారణలో చూడొచ్చు. ఇక మన ఫేవరెట్ సింగర్ గొంతులో మనకు నచ్చిన పాట వినొచ్చు. ప్రధాని మోదీ, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కలిసి స్టెప్పులేసినట్లు వీడియోలు క్రియేట్ చేయొచ్చు.

కోలీవుడ్ హీరోల ఏఐ వీడియో

ఇలా ఏఐ సాయంతో కాస్త క్రియేటివిటీ జోడించి వివిధ రకాల ఫొటోలు, వీడియోలు, ఆడియోలు రూపొందించొచ్చు. కొందరు వీటిని మిస్ యూజ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం తమ క్రియేటివిటీతో నెటిజన్లను మెప్పిస్తున్నారు. అలా ఇటీవల బాగా వైరల్ అవుతున్న ట్రెండ్లలో ఒకటి.. ‘అప్పుడలా.. ఇప్పుడిలా’ . ఈ ట్రెండ్ లో భాగంగా ఒకప్పటి ఫొటోను ప్రస్తుత ఫొటోలతో పోల్చుతూ రీల్స్ చేస్తున్నారు.

అప్పుడలా ఇప్పుడిలా

ఈ ట్రెండ్ కు తగ్గట్టుగా ఓ నెటిజన్ కాస్త క్రియేటివ్ గా ఆలోచించి ఓ ఏఐ వీడియోను రూపొందించాడు. తన ఫేవరెట్ హీరోలు తమ యంగ్ ఏజులో ఎలా ఉన్నారు.. ఇప్పుడెలా ఉన్నారో ఫొటోలతో వీడియో చేశాడు. అయితే ఈ వీడియోలో కేవలం తమిళ హీరోలు (Kollywood Heroes AI Video) మాత్రమే ఉన్నారు. వారు యుక్త వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు.. ఇప్పుడెలా ఉన్నారో ఈ వీడియోలో మనం చూడొచ్చు.

నెట్టింట మరో నయా ట్రెండ్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. కోలీవుడ్‌ స్టార్ హీరోలు రజనీకాంత్‌ (Rajinikanth) , కమల్‌ హాసన్‌ (Kamal Haasan),  అజిత్‌ (Ajith), విజయ్‌, సూర్య(Suriya), విక్రమ్‌, ధనుశ్, శింబు, శివకార్తికేయన్ వంటి హీరోల ఫొటోలను ఏఐ సాయంతో ఎడిట్‌ చేసి వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియోలో వారు వారి యంగ్ సెల్ఫ్ తో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. ‘అప్పుడు.. ఇప్పుడు మన హీరోలు ఎలా ఉన్నారో చూడండి’ అంటూ దీనికి క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *