‘మూసీ ముసుగు దొంగ ఎవరు?.. ‘బతుకమ్మ’పై ఎందుకీ నిర్లక్ష్యం’

Mana Enadu : బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) ఎక్స్ వేదికగా ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉన్నారు. తాజాగా ఆయన మరోసారి తన ట్వీట్ తో ప్రభుత్వంపై మండిపడ్డారు. మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరని ఆయన తాజాగా పోస్టు పెట్టారు. రుణమాఫీ (Runa Mafi) ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తోంది ఎవరని నిలదీశారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

మూసీ ముసుగు దొంగ ఎవరు?

‘‘రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు..? అని కేటీఆర్ నిల‌దీశారు. రైతుబంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు..? మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రూ. 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు..? అవ్వ, తాతలకు నెలకు రూ. 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు..? ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు..? మూసీ బ్యూటిఫికేషన్ పేరిట రూ. 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్‌కి తెరతీసిన ఘనుడు ఎవరు?’’ అని కేటీఆర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.

రేవంత్ కు మనసు రావట్లేదా?

మరోవైపు ఇంకో ట్వీట్ లో కేటీఆర్.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి బతుకమ్మ అంటే గిట్టదా, పట్టదా అని అడిగారు. ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా అని నిలదీశారు. రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బతుకమ్మ అంటే గిట్టదా.. పట్టదా?

‘బతుకమ్మ అంటే గిట్టదా..పట్టదా ఈ ముఖ్యమంత్రికి? ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా ? పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా వుంచలేరా ? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాల్నా? బ్లీచింగ్ పౌడర్ కొనడానికి..చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపురించాయి పంచాయతీల్లో! రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది..? తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం..? ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను.. స్వచ్ఛమైన పరిసరాల్లో జరుపుకునే భాగ్యం కూడా లేదా మహిళలకు? బతుకమ్మ చీరెలను రద్దు చేసారు..ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా..?’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *