Mana Enadu : కొంతకాలంగా సినీ నటుడు నాగార్జున(Nagarjuna)కు కలిసి రావడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆయన టైం ఏం బాగోలేదని అర్థమవుతోంది. ఇటీవలే ఆయనకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ (N Convention Demolition) సెంటరును రేవంత్ సర్కార్ కూల్చివేసిన విషయం తెలిసిందే.
నాగార్జున Vs కొండా సురేఖ
ఇక తాజాగా రేవంత్ కేబినెట్ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) నాగచైతన్య-సమంత విడాకులపై, నాగార్జున కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నాగార్జునతో పాటు యావత్ సినీ ఇండస్ట్రీ ఆ మహిళా మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున అయితే ఏకంగా పరువు నష్టం దావా వేశారు.
నాగార్జునపై సర్కార్ కక్ష సాధింపు
ఇక ఈ పరిణామంతో రేవంత్ సర్కార్ నాగార్జునపై కక్షసాధింపు చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు (Nagarjuna Case) నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఆదేశించినట్లు సమాచారం. తమ్మిడికుంటను కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని ఆరోపణలు వచ్చాయి.
నాగార్జునపై కేసు నమోదు
ఈ నేపథ్యంలో నాగార్జునపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆయన స్పందించాల్సి ఉంది. అయితే కొండా సురేఖ వివాదం పెద్దది కావడం, యావత్ టాలీవుడ్ నాగార్జునకు మద్దతుగా నిలుస్తూ రేవంత్ సర్కార్ పై విరుచుకుపడటంతో కక్షగట్టి రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) నాగార్జునను, ఆయన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు.






