రాహుల్ జీ.. హైదరాబాద్ యువత మిమ్మల్ని రమ్మంటోంది : కేటీఆర్

Mana Enadu : బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఎక్స్ (ట్విటర్) వేదికగా కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. మరోవైపు జాతీయ నేతలను, కేంద్ర సర్కార్ వైఫల్యాలను కూడా నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఎక్స్ ను వేదికగా చేసుకుని హస్తం అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీకి హైదరాబాద్ యువకులు స్వాగతం పలుకుతున్నారంటూ ఓ పోస్టు పెట్టారు. 

రాహుల్ జీకి స్వాగతం

హైదరాబాద్ అశోక్ నగర్‌లోని యువత ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ధన్యవాదాలు తెలిపేందుకు ఎదురుచూస్తున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రూ.5 లక్షల యువ వికాసం సాయం, పునరుద్ధరణకు ధన్యవాదాలు అని పోస్టులో పేర్కొన్నారు. రాహుల్ ఇచ్చిన హామీ పూర్తయినందున యువకులను కలవడానికి తిరిగి హైదరాబాద్‌(Hyderabad)కు స్వాగతం అంటూ విమర్శించారు. గతంలో హైదరాబాద్‌లోని అశోక్‌ నగర్‌లో పర్యటించిన సందర్భంగా రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని కేటీఆర్‌ ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. 

కేసీఆర్ తో సాధ్యం.. నేడు అసాధ్యం

“బీసీ బిడ్డలకు విదేశీ విద్య అందని ద్రాక్షేనా? నాడు కేసీఆర్‌తో సాధ్యం.. నేడు అసాధ్యం.. పేద విద్యార్థులతో సర్కార్ చెలగాటం. జ్యోతిబా ఫులే విదేశీ విద్య పథకానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తోంది. అధికారుల సాగతీతతో విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల కోర్సులు ముగుస్తున్నాయి. ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. దరఖాస్తు చేసుకొని ఏడాది అవుతున్నా ఎందుకింత నిర్లక్ష్యం? వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును రేవంత్‌ సర్కార్‌ (Revanth Govt) అంధకారంలోకి నెట్టింది. తక్షణం జాబితా ప్రకటించి ఉపకార వేతనం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని కేటీఆర్‌ తన పోస్టులో పేర్కొన్నారు.

Related Posts

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *