కుబేర ఓటీటీ డీటెయిల్స్ ఇవే.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్​ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’(Kubera) ఈ నెల 20న విడుదలై హిట్​ టాక్​ తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika) కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ, ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన వ్యక్తి మరియు వీధుల్లో జీవించే పేదవాడి మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది. శేఖర్ కమ్ముల మార్క్ స్టైల్‌లో రూపొందిన ఈ చిత్రంలో భావోద్వేగాలు, క్రైమ్, సోషల్ మెసేజ్ కలబోసి ప్రేక్షకులను మెప్పించాయి.

ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులను ప్రముఖ సంస్థలు సొంతం చేసుకున్నాయి. ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్(Amezan Prime) వీడియో దక్కించుకోగా, శాటిలైట్ హక్కులు స్టార్ మా ఛానల్(Star Maa) చేతిలోకి వెళ్లాయి. కాగా ఈ సినిమా జూలై (July) చివరివారంలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. థియేటర్ రన్ పూర్తిగా ముగిశాకే ఓటీటీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారని సమాచారం.

ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఎల్‌ఎల్‌పి మరియు అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. కంటెంట్ పరంగా నిండుగా ఉండే ఈ చిత్రం, థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీ, టీవీ వేదికగా కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *