పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఫస్ట్ మూవీ ‘సతీ లీలావతి’.. ఫస్ట్ లుక్ రిలీజ్

నాగ బాబు(Naaga Babu) తనయుడు వరుణ్ తేజ్(Varun Tej) తో పెళ్లి తర్వాత వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi).. రీసెంట్ గా ఓ సినిమాకు కమిటై ఈ సినిమాను చకచకా పూర్తి చేస్తోంది. ఆ సినిమా పేరే ‘సతీ లీలావతి’(Sathi Leelavathi ). లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్(First Look) ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

కుటుంబ వ్య‌వ‌స్థ బ‌ల‌హీన పడుతున్న నేటి కాలంలో.. అందుకు కార‌ణం మ‌నుషుల మ‌ధ్య ఎమోష‌న్స్ లేక‌పోవ‌టమే అంటున్నారు. భావోద్వేగాలే బంధాల‌ను క‌ల‌కాలం నిలుపుతాయి. రెండు వేర్వేరు కుటుంబాలు, నేప‌థ్యాల నుంచి వచ్చిన వ్య‌క్తులు క‌లిసి ప్ర‌యాణించాలంటే వారి మ‌ధ్య ఎమోష‌న్స్ ఇంకెంత బ‌లంగా ఉండాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇలాంటి సునిశిత‌మైన అంశాన్ని తీసుకొని సతీ లీలావతి అంటూ హృద్యంగా తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య‌.

ఈ సినిమాలో లావ‌ణ్య త్రిపాఠి, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌ (శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దీన్ని రూపొందిస్తున్నారు.

భార్య‌, భ‌ర్త మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌ గానూ చెప్పే ప్ర‌య‌త్న‌మే స‌తీలీలావ‌తి చిత్రం. సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం మేక‌ర్స్ సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేసి సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *