CPM First List: 14 మందితో సీపీఎం తొలిజాబితా విడుదల

మన ఈనాడు:

తెలంగాణ ఎన్నికల్లో ప్రతి పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. మన్నటి వరకూ కాంగ్రెస్‌తో పొత్తుకోసం ప్రయత్నించిన సీపీఎం నేడు ఒంటరిగా బరిలో దిగేందుక సిద్దమైంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను సీపీఎం ప్రకటించింది. మొదటి లిస్ట్‌లో దాదాపు 14 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. చివరి నిమిషం వరకూ కాంగ్రెస్‌తో పొత్తు కోసం సీపీఎం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు.

తెలంగాణ ఎన్నికల్లో ప్రతి పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. మన్నటి వరకూ కాంగ్రెస్‌తో పొత్తుకోసం ప్రయత్నించిన సీపీఎం నేడు ఒంటరిగా బరిలో దిగేందుకు సిద్దమైంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను సీపీఎం ప్రకటించింది. మొదటి లిస్ట్‌లో దాదాపు 14 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. చివరి నిమిషం వరకూ కాంగ్రెస్‌తో పొత్తు కోసం సీపీఎం(CPM) ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. గతంలో మిర్యాలగూడ, వైరా స్థానాలను ఇవ్వాలని సీపీఎం కోరింది. అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. దీంతో 17 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు సీపీఎం ప్రకటించింది. అందులో భాగంగానే అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితా విడుదల చేసింది.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు. దీనిపై మాజీ హోం మంత్రి జానా రెడ్డి స్పందించారు. సీపీఎం తమ అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసుకోవాలని కోరారు. దీనికి నిరాకరించిన కమ్యూనిస్ట్ పార్టీలు కుదరదు అని జానారెడ్డికి తేల్చి చెప్పిన తమ్మినేని వీరభద్రం. ఇప్పటి వరకూ 14 స్థానాలను ప్రకటించగా త్వరలో మరో 3 స్థానాలను వెల్లడిస్తామన్నారు. ఇదిలా ఉంటే ఇంకా ఇప్పటి వరకూ 19 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించలేదు. చెన్నూరు, కొత్తగూడెం స్థానాలు ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతుండటంతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సీట్ల విషయంలో కొత్తగూడెంతో పాటు ఒక ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదన చేసింది. దీనికి అంగీకరిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

 

Share post:

లేటెస్ట్