Anupama Parameswaran: లిల్లి బోల్డ్​ కాదు..గుర్తుండిపోయి క్యారక్టర్​

గతంలో రిలీజ్ అయిన డీజే టిల్లు సూపర్ హిట్ కాగా.. ఈసారి టిల్లు స్వ్కేర్ మూవీతో మళ్లీ గట్టిగానే నవ్వించాడని అంటున్నారు అడియన్స్.. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో నిన్న సాయంత్రం చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.

మార్చి 29న సిల్వర్​ స్క్రీన్స్​పై టిల్లు స్వేర్​ విడుదల అయ్యింది. మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకులకు అన్‎లిమిటెడ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అందించాడు సిద్ధూ జొన్నలగడ్డ. గతంలో రిలీజ్ అయిన డీజే టిల్లు (DJ Tillu) సూపర్ హిట్ అయింది. ఈసారి టిల్లు స్వ్కేర్(Tilli Square) మూవీతో మళ్లీ గట్టిగానే నవ్వించాడని ప్రేక్షకులు రివ్యూలు ఇస్తున్నారు. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో నిన్న సాయంత్రం చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించని అనుపమ.. సక్సెస్ మీట్ లో పాల్గొంది. ఇదే కార్యక్రమంలో మరోసారి బోల్డ్ క్యారెక్టర్ కామెంట్స్ పై స్పందించింది అనుపమ. ఈ సినిమాలోని లిల్లి పాత్ర వదులుకుంటే మంచి అవకాశాన్ని మిస్ అవుతానని చెప్పుకొచ్చారు.

ఈ మూవీ సక్సెస్ మీట్ లో మరోసారి అనుపమకు ఇన్నాళ్లు ఇలాంటి బోల్డ్ పాత్ర చేయలేదు.. ఇప్పుడేందుకు చేశారని ప్రశ్నించారు. ఇందుకు అనుపమ మాట్లాడుతూ.. “ఈ సినిమా చూసిన తర్వాత కూడా మీకు నా క్యారెక్టర్ బోల్డ్ అనిపిస్తుందా ?.. ఇప్పుడు ఈ ప్రశ్నను నవ్వుతూ అడుగుతున్నారు. విడుదలకు ముందు మాత్రం అలా అడగలేదు. మీరు సినిమా చూసి కన్వెన్స్ అయ్యారు కాబట్టి నవ్వుతూ అడుగుతున్నారు. నేను కూడా రిలీజ్ కు ముందే ఇదే మాట చెప్పాను. ఈ సినిమాలోని లిల్లి పాత్రను వదులుకుంటే మంచి అవకాశం వదులుకున్నట్లు అవుతుంది. ఈ పాత్రలలో నేను కొత్తగా కనిపించానని మీరే అంటున్నారు. అందుకే ఆ పాత్ర చేశాను” అంటూ చెప్పుకొచ్చారు.

Related Posts

పెళ్లి పీటలెక్కబోతున్న రామ్ చరణ్ హీరోయిన్

‘రూబా రూబా.. హే రూబా రూబా.. రూపం చూస్తే హాయ్ రబ్బా’.. అంటూ రామ్ చరణ్ తన గుండెల్లో వీణమీటిన హీరోయిన్ గురించి ఆరెంజ్ (Orange) సినిమాలో పాట పాడుతుంటాడు. అలా కేవలం చెర్రీ గుండెలోనే కాదు కుర్రకారు గుండెల్లో తిష్ట…

పద్మభూషణ్ బాలయ్యకు . సెలబ్రిటీల శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ జాబితాలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలకృష్ణ, తమిళ ఇండస్ట్రీ నుంచి అజిత్ కుమార్, నటి శోభనలు పద్మభూషణ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *