స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఇసుక మైనింగ్ రూల్స్ 2015 అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మధ్య కాలంలో వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలంటే ప్రభుత్వానికి వరుసగా విజ్ఞప్తులు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకకు ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం భావించింది. సొంత అవసరాలకు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు ఉన్నతాధికారులు.
Also Read: వీళ్లకే కొత్త రేషన్ కార్డులు
ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ అనేక కొత్త విధానాలను ప్రజల ముందుకు తీసుకొస్తోంది. అందులో భాగంగానే ఇసుక కొరతకు చెక్ పెట్టేలా పలు మార్గదర్శకాలను జారీ చేసింది. స్థానికంగా భవన నిర్మాణాలకు ఇసుక కొరత ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకన్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాలు, మండలాల్లో నిర్మాణ దశలో ఉన్న పనులు ఆగిపోకూడదని, అవసరాలకు అనుగుణంగా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతించింది. ఈ మేరకు శనివారం ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.