ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడంపై కేటీఆర్ (KTR)విమర్శలు చేశారు. బీఆర్ఎస్(BRS) టికెట్ మీద ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీలోకి దానం వెళ్లారని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ చిత్తుచిత్తుగా ఓటమి చూస్తారన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్‌కు పోటీ బీజేపీతోనే అని పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు (Padma Rao) భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
పద్మారావు గౌడ్ హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరికి సుపరిచితులు. లష్కర్(సికింద్రాబాద్) అంటేనే గుర్తుకు వచ్చేది.. కాబోయే లష్కర్ ఎంపీ పద్మారావు. 2002, ఫిబ్రవరి 14 నాడు టీఆర్ఎస్ కార్పొరేటర్‌గా పద్మారావు గెలిచారు. నాటి నుంచి నేటి వరకు పద్మారావు కేసీఆర్‌ను వెన్నంటి ఉన్నారు. పద్మారావును సికింద్రాబాద్ ఎంపీగా కేసీఆర్ ప్రకటించగానే నాకు 25 దాకా మేసేజ్‌లు వచ్చాయి. పద్మారావును ప్రకటించి బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారని మేసేజ్‌లో తెలిపారు.