China Floods: వరదలకు కొట్టుకుపోయిన రూ.12 కోట్ల విలువైన బంగారం.. ఎగబడ్డ జనం

చైనాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి (Floods in China). అకాల వర్షాలతో పలు ప్రాంతాలు వరదల్లో మునిగిపోతున్నాయి. తీర ప్రాంతాల్లోని చిన్న ఇళ్లు, గుడిసెలు కొట్టుకుపోయి చాలా మంది నిరాశ్రయులవుతున్నారు. ఇదిలా ఉంటే.. వరదల కారణంగా షాంగ్జీ ప్రావిన్స్​ ప్రాంతంలోని ఓ జువెల్లరీ షాప్​ లోని విలువైన బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో వాటిని వెతికేందుకు జనాలు వీధుల్లోకి చేరారు.

బంగారు హారాలు, వజ్రపు ఉంగరాలు..

షాంగ్జీ ప్రావిన్స్ లోని వుచి కౌంటీ ప్రాంతం సముద్ర తీరానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న లావో ఫెంగ్జియాంగ్ ఆభరణాల దుకాణాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో దుకాణంలోని నగలు, సేఫ్ బాక్స్ కొట్టుకుపోయాయి. బంగారు (Gold) హారాలు, గాజులు, ఉంగరాలు, చెవి దుద్దులు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు కొట్టుకుపోయినట్లు యజమాని తెలిపారు. సేఫ్ బాక్సులో రీసైకిల్ చేసిన బంగారంతో పాటు భారీగా నగదు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. దాదాపు 20 కిలోల బంగారం, నగదు గల్లంతైనట్లు తెలిపారు. వీటి విలువ 10 మిలియన్ యువాన్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.12కోట్ల పైమాటే) ఉంటుందని వెల్లడించారు.

China Devastated: Flash Flood Obliterates Village in Shandong — Residents Cry Out in Agony - YouTube

సోషల్​ మీడియాలో వైరల్​ అవతున్న వీడియోలు

అయితే జువెల్లరీ షాప్​ నుంచి బంగారం కొట్టుకుపోయిన విషయం మీడియా ద్వారా బయటకు రావడంతో ఆ బంగారాన్ని దక్కించుకునేందుకు స్థానికులు పెద్దఎత్తున వెతకడం ప్రారంభించారు. కానీ కొందరు తమకు దొరికిన ఆభరణాలను తనకు వెనక్కి ఇచ్చేశారని దుకాణ యజమాని తెలిపారు. ఇప్పటివరకు కేజీ బంగారం తమ వద్దకు చేరిందన్నారు. రోజులు గడుస్తున్నా మిగతా బంగారం కోసం స్థానికులు వెతుకుతూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో మారాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *