Janahita Padayatra: పార్టీ బలోపేతమే లక్ష్యంగానేటి ప్రజల్లోకి టీకాంగ్రెస్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో టీకాంగ్రెస్ జనహిత పాదయాత్ర (Janahita Padayatra) యాత్ర నిర్వహించనుంది. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) సైతం ఈ యాత్రం పాల్గొంటారు. ఈ సందర్భంగా నేటి నుంచి ఆగస్టు 4 వరకు ఐదురోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. వికారాబాద్ జిల్లా(Vikarabad District) పరిగి నియోజకవర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభమై, వర్ధన్నపేట వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections) కోసం కాంగ్రెస్ పార్టీ గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.

రెండో విడతగా పాదయాత్ర, శ్రమదానాలు

‘‘రాష్ట్రంలో గురువారం నుంచి ఆగస్టు 4 వరకు మొదటి విడత జనహిత పాదయాత్ర(Janahita Padayatra) ఉంటుంది. ఇందులో భాగంగా శ్రమదానాలు సైతం నిర్వహిస్తాం. తొలిరోజున రంగారెడ్డి జిల్లా పరిగిలో ప్రారంభిస్తారు. ఆగస్టు 4న ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌లో సమావేశం ఉంటుంది. 5, 6, 7 తేదీల్లో దిల్లీలో కార్యక్రమాలు ముగిశాక రెండో విడతగా పాదయాత్ర, శ్రమదానాలు ఆగస్టు 8 నుంచి యథావిధిగా కొనసాగుతాయి’’ అని మహేశ్‌కుమార్‌గౌడ్‌ CMకి వివరించారు. ఈ కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటున్నట్లు మీనాక్షి నటరాజన్‌ తెలిపారు.

బీసీ రిజర్వేషన్లపై ఆందోళన

ఇదిలా ఉండగా బీసీ రిజర్వేషన్ల(BC Reservations) కోసం ఢిల్లీలో ఆగస్టు 5 నుంచి 7 వరకు ఆందోళన కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ఈ ఆందోళనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొననున్నారు. ఆగస్టు 7న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu)కు వినతిపత్రం సమర్పిస్తారు. ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రజల్లో పట్టు సాధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Criticism on BRS Krishna water utilization: CM Revanth Reddy's stance on  water

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *