మహావతార్ నరసింహ తొలి వారం వసూళ్లు అదరహో.. బాక్సాఫీస్ హీట్ పెంచేసిందిగా!

సినిమా అంటే స్టార్ హీరోహీరోయిన్లు ఉండాలి అనే రోజులు ఎప్పుడో పోయాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ వస్తోంది. అలాంటి కేటగిరీలోనే ఉంది మహా అవతార్ నరసింహ. కాకపోతే ఈ మూవీ ఇంకా డిఫరెంట్. ఈ సినిమాలో నటీనటులు లేనేలేరు.. కానీ థియేటర్స్‌కి వచ్చిన ఆడియన్స్ మాత్రం ఊగిపోతున్నారు. బిగ్ స్క్రీన్ పై రసింహుడి ఉగ్రరూపం చూసి పూనకాలెత్తిపోతున్నారు.

జూలై 25న థియేటర్లలో విడుదలైన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’(Mahavatar Narsimha) బాక్సాఫీస్‌ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేస్తోంది. ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి పాన్‌ఇండియా హిట్‌లను అందించిన హోంబలే ఫిలిమ్స్ తాజా ప్రయత్నంగా ఈ సినిమాను ప్రెజెంట్ చేసింది. ప్రారంభంలో మాత్రం ఈ ప్రాజెక్టుపై పెద్దగా అంచనాలు కనిపించలేదు.

హోంబలే సంస్థ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ను లాంచ్ చేస్తూ, ఈ యూనివర్స్ నుంచి ఏడు సినిమాలు తీసుకొస్తామన్నారు. అందులో మొదటి భాగంగా ‘మహావతార్ నరసింహ’ ఈ ఏడాది వస్తుందని.. ఆ సంస్థ కొద్దిరోజుల క్రితం ప్రకటించింది.

మహావతార్ నరసింహ విడుదలైన ముందు రోజు వరకూ, ప్రేక్షకుల్లో కానీ, ట్రేడ్ వర్గాల్లో కానీ ఆసక్తి లేకపోయినా… విడుదల తర్వాత మాత్రం పాజిటివ్ మౌత్ టాక్తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ప్రత్యేకించి పిల్లల నుంచి విశేష స్పందన వస్తోంది.

ఈ సినిమా విడుదలైన తొలి వారం(First Week Collections) లోపే రూ.53 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఫుల్ రన్‌లో ఇది రూ.100 కోట్ల మార్క్‌ను అధిగమించే అవకాశాలున్నాయి.

స్టార్ కాస్ట్ లేకపోయినా, కంటెంట్‌ బలంతో ప్రేక్షకుల మన్ననలు గెలుచుకోవచ్చని ‘మహావతార్ నరసింహ’ ఘనంగా నిరూపించింది. ఇది కేవలం ఓ యానిమేషన్ ఫిల్మ్ మాత్రమే కాదు, భక్తి, భావోద్వేగం, టెక్నికల్ క్వాలిటీ మిళితమైన ఒక సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *