SSMB29 అప్‌డేట్.. మ‌హేశ్ బాబు న్యూ లుక్ వైర‌ల్

‘గుంటూరు కారం’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమం జరిగింది. కానీ దీని గురించి మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇక ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కూడా భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపైనా క్లారిటీ లేదు. చాలా గుట్టుగా జక్కన్న ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్స్ ఏం లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు.

ఇది మా బాబు మహేశ్ బాబేనా

అయితే ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. పొడవాటి జుట్టుతో ఇప్పటికే పలు కార్యక్రమాల్లో సూపర్ స్టార్ కనిపించాడు. అయితే తాజాగా మహేశ్ బాబు న్యూ లుక్ (Mahesh Babu New Look) అంటూ ఓ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ లుక్ లో మహేశ్ బాగా జుట్టు, గడ్డం పెంచి కనిపించాడు. ఉంగరాల జుట్టుతో తన ఫెయిర్ లుక్ మార్చేసి ర‌గ్గ‌డ్ లుక్ తో సర్ ప్రైజ్ చేశాడు. ఇక జిమ్ లో కసరత్తు చేస్తూ అద్దంలో చూసుకుంటున్నట్లు ఈ వీడియోలో చూడొచ్చు.  ప్రస్తుతం ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతోంది.

బాబు న్యూ లుక్ అదుర్స్

వీడియో చూసిన ఫ్యాన్స్.. ఇది బాబు న్యూ లుక్ అంటూ ప్రచారం మొదలెట్టేశారు. బాబు కొత్త లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో విదేశీ నటులు భాగం కానున్నట్లు తెలిసింది. ఇక ఈ సినిమాకు సంబంధించి జక్కన్న (SS Rajamouli) పెద్ద ప్లాన్ వేస్తున్నాడట. అందుకే కనీసం సినిమా పూజా కార్యక్రమానికి మీడియాను కూడా అనుమతించలేదని నెట్టింట టాక్. ఇక ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వెయిటింగ్.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *