బేసిగ్గా చెప్పాలంటే టాలీవుడ్(Tollywood)లో యానిమేషన్(Animation) సినిమాలకు పెద్దగా క్రేజ్ ఉండదు. ఒకవేళ ఉన్నా ఒకటి రెండు రోజులకు మించి థియేటర్లు హౌజ్ ఫుల్ అవడం కష్టమే. కానీ 2019లో వచ్చిన ‘ది లయన్ కింగ్(The Lion King)’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చిన్నాపెద్దా అనే తేడాలేకుండా అభిమానులు ఉన్నారు. అందులోనూ ఈ మూవీ తెలుగు వర్షెన్‌లో కొన్ని జంతువులకు అలీ, బ్రహ్మానందం, రవిప్రకాశ్, జగపతిబాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. తాజాగా ఈ మూవీకి కొనసాగింపుగా ‘ముఫాసా: ది లయన్ కింగ్(Mufasa: The Lion King)’ ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది.
మహేశ్ బాబు వాయిస్ ఓవర్
ఈ మూవీ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది. ఎందుకంటే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు(Superstar Mahesh Babu) ఈ మూవీలో ముఫాసా అనే సింహానికి వాయిస్(Voice over) అందించారు. దీంతో తమ అభిమాన నటుడు వాయిస్‌తో సింహాం నోట చూడాలని అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. దీంతో చాలా చోట్లా హౌజ్‌ఫుల్ అయ్యాయి. మరి ఈరోజు వచ్చిన ముఫాసా ప్రేక్షకులను అలరించిందో? అనేది తెలుసుకుందాం..
ముఫాసా కథేంటంటే..
సింబా(Simba) కూతురు కియారాకి తన తాత ముఫాసా(Mufasa) కథను రఫీకీ చెబుతుంటాడు. అలా ఈ కథను మనకు కూడా చూపించేస్తారు. ముఫాసా (Maheshbabu Voice over) వరదల్లో కొట్టుకుపోవడంతో చిన్నతనంలోనే కుటుంబానికి దూరంగా ఉంటాడు. కానీ చిన్నతనంలో అమ్మ చెప్పిన కథలు వింటూ మిలేలే అనే స్వర్గం లాంటి అందమైన రాజ్యం గురించి కలలు కంటూ ఉంటాడు. ఇక అలా వరదల్లో కొట్టుకుంటూ టాకా (Voice over by Satya Dev) ఉన్న రాజ్యానికి వస్తాడు. కానీ ఓబీసీ రాజు ముఫాసా రావడాన్ని ఒప్పుకోడు. అనాథ అంటూ ఎప్పుడూ ముఫాసాను చిన్నచూపు చూస్తూనే ఉంటాడు.
ముఫాసా ఎలా రాజుగా మారాడు?
కానీ టాకా(Taka) మాత్రం ముఫాసాను అన్నలా భావిస్తాడు. టాకా కాస్త పిరికివాడు. భయస్థుడు. ఒక సారి తెల్ల సింహాల గుంపు తల్లి మీద అటాక్ చేస్తే టాకా భయపడి పారిపోతాడు. కానీ ముఫాసా(Mufasa) మాత్రం తల్లిని కాపాడతాడు. ఆ క్రమంలో తెల్ల సింహాల యువరాజుని ముఫాసా చంపేస్తాడు. దీంతో తెల్ల సింహాల దాడి నుంచి తప్పించుకునేందుకు వారి రాజ్యాన్ని వదిలి మిలేలే రాజ్యం వైపు ముఫాసా, టాకాలు పరుగులు తీస్తారు. ఆ జర్నీలోనే రఫీకీ ఎంట్రీ ఉంటుంది. అసలు టాకా అనేవాడు ముఫాసాకు ఎందుకు తిరుగుతాడు? చివరకు ఏమీ లేని ముఫాసా ఎలా రాజు(King)గా మారాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.






