Mana Enadu : ‘మత్తు వదలరా’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి (Sri Simha). ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో మేకర్స్ ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించారు. ‘మత్తు వదలరా 2 (Mathu Vadalara 3 )’ పేరుతో సెప్టెంబరు 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పార్ట్-1 కంటే పార్ట్-2 మరింత ఎంటర్టైనింగ్ గా ఉందని పాజిటివ్ టాక్ ఇస్తున్నారు.
మహేశ్ బాబు రివ్యూ
కేవలం ప్రేక్షకులే కాదు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను వీక్షించారు. తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఈ సినిమా గురించి చేసిన నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. కొత్త సినిమాలు, కొత్త దర్శకులను ఎప్పుడూ ప్రోత్సహించే మహేశ్ బాబు మత్తువదలరా టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
నవ్వు ఆపుకోలేకపోయాం
“‘మత్తు వదలరా 2 (Mathu Vadalara 3 Review)’ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఈ సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తూ చూశాను. హీరో శ్రీ సింహతో పాటు మిగతా నటీనటులంతా అద్భుతంగా నటించారు. వెన్నెల కిశోర్ నువ్వు స్క్రీన్ మీద కనిపించినంత సేపు నా కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది. సత్య నువ్వు సినిమాలో కనిపించినప్పుడల్లా మేమంతా నవ్వకుండా ఉండలేకపోయాం. అద్భుతంగా నటించారు. టీమ్ మొత్తానికి అభినందనలు” అంటూ మహేశ్ బాబు మూవీ టీమ్‌ను అభినందించారు.
మరోవైపు ఈ మూవీ సక్సెస్ మీట్లో డైరెక్టర్ రితేశ్ రానా (Ritesh Rana) ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ‘మత్తు వదలరా 2’ సినిమాకు వచ్చిన ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమాకు మూడో భాగాన్ని కూడా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. తప్పకుండా ‘మత్తు వదలరా 3’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.