Mana Enadu : బిగ్ బాస్ తెలుగు సీజన్-8 (Bigg Boss 8) రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. చిన్నచిన్న గొడవలు, అలకలు, బుజ్జగింతలు, బిగ్ బాస్ టాస్కులు, కంటెస్టెంట్ల స్ట్రాటజీలతో ఈ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూస్తుండగానే రెండో వారం కూడా ముగిసింది. ఇప్పటికే మొదటి వీక్ లో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ్టి సండే ఎపిసోడ్ (సెప్టెంబరు 15వ తేదీ) లో హౌస్ నుంచి ఎవరు వెళ్లిపోతున్నారు?
ఈ వారం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు (Bigg Boss Elimination) నామినేట్ అయిన విషయం తెలిసిందే. వారిలో శేఖర్ బాషా, పృథ్వీరాజ్, నిఖిల్, ఆదిత్య, నాగ మణికంఠ, నైనిక, సీత, విష్ణు ప్రియ ఉన్నారు. అయితే ఇవాళ్టి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ కత్తి శేఖర్ బాషా, ఆదిత్య ఓంలపైనే ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఎనిమిది మందిలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న నిఖిల్ (Nikhil), విష్ణుప్రియ సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలిసింది. సింపతి కార్డు ప్లే చేసిన నాగ మణికంఠ ఇప్పుడు ఆట తీరును మెరుగు పరుచుకుని ఈ వీక్ సేఫ్ జోన్లో ఉన్నట్లు టాక్.
ఇక డేంజర్ జోన్లో ఉన్నది మిగతా ఐదుగురు నైనిక, పృథ్వీరాజ్, సీత, శేఖర్బాషా, ఆదిత్య ఓం (Adithya Om). చివరలో ఉన్న ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నా.. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఆదిత్యకే ఉన్నట్లు టాక్. అయితే ఈ వీకెండ్ ఊహించని పరిణామం చోటు చేసుకోబోతోందని బిగ్ బాస్ వర్గాల్లో టాక్. అయితే డబుల్ ఎలిమినేషన్ (Double Elimination) ఉండే ఛాన్స్ ఉందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే నిజమైతే శేఖర్ బాషా, ఆదిత్య ఓం ఇద్దరూ ఎలిమినేట్ అవ్వడం ఖాయం. ఏం జరుగుతుందో తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.