జేఈఈ మెయిన్(JEE MAIN 2025) సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ(Final Answer Key)ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల గురువారం రాత్రి చేసింది. ఏప్రిల్ 2 నుంచి 9 వరకు జరిగిన పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in నుంచి ఫైనల్ ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఏప్రిల్ 11న విడుదల చేశారు. అభ్యంతరాలను తెలియజేయడం కోసం ఏప్రిల్ 13 వరకు ఆబ్జెక్షన్ విండో తెరిచి ఉంది.

ఇక జనవరి, ఇటీవల జరిగిన ఈ పరీక్షల్లోని స్కోర్(Score) ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. ఈ పరీక్ష సమాధానాల్లో పలు తప్పిదాలు ఉన్నాయంటూ విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై NTA స్పందించింది. తుది కీ వచ్చే వరకు వేచి చూడాలని విద్యార్థులకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ కీ మాత్రమే స్కోరును నిర్ణయిస్తుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. కాగా కాసేపట్లో ఫలితాలను కూడా ప్రకటించనుంది.
ఫైనల్ ఆన్సర్ కీ ని ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
☛ జేఈఈ మెయిన్ 2025 సెషన్-2 ఫైనల్ ఆన్సర్ కీ డౌన్లోడ్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
☛ ముందుగా జేఈఈ మెయిన్ 2025 అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.
☛ హోమ్ పేజీలో కనిపించే ‘జేఈఈ-2025 సెషన్-2 ఫైనల్ ఆన్సర్ కీ’ అనే లింక్‌పై క్లిక్ చేయండి.
☛ మీ స్క్రీన్ పై ఫైనల్ ఆన్సర్ కీ PDF ఓపెన్ అవుతుంది.
ఆన్సర్ కీని చెక్ చేసి, డౌన్ లోడ్ చేసుకోండి.
☛ జేఈఈ మెయిన్ 2025 సెషన్-2 ఫలితాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
☛ మరిన్ని అప్డేట్స్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/ను సంప్రదించండి.








