పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ది రాజా సాబ్ (The Raja Saab)’. హారర్ రొమాంటిక్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ప్రభాస్ మొదటి సారిగా హారర్ జానర్ లో సినిమా చేస్తుండటంతో ప్రేక్షకులు ఈ చిత్రం కోసం చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేస్తామని చెప్పిన మేకర్స్ తాజాగా ఆ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
రాజా సాబ్ రిలీజ్ వాయిదా
ఇక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుండగా.. రాజా సాబ్ నుంచి సీన్ లీక్ (The Raja Saab Leaked Video) అంటూ ఓ వీడియో సోషల్ మిడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో హీరోయిన్ మాళవిక మోహనన్ పింక్ షార్ట్ అండ్ షర్ట్ ధరించి కనిపిస్తోంది. ఇక గాల్లోకి ఎగిరి ఫైట్ చేస్తున్నట్లుగా వీడియోలో మనం చూడొచ్చు. అయితే ఇది మాళవిక (Malavika Mohanan) వీడియో కావడంతో ఆమె ప్రస్తుతం ప్రభాస్ తో రాజా సాబ్ లో నటిస్తుండటంతో ఆ సినిమా సీనే అయుంటుందని అందరూ భావిస్తున్నారు.
#TheRajaSaab leaked fight scene #MalvikaMohan 🫶🩷#prabhas pic.twitter.com/GANlw49fiz
— Darling ❤️ (@ThumbalamKumar) January 19, 2025
రాజా సాబ్ నుంచి సీన్ లీక్
అలా ది రాజా సాబ్ లీక్డ్ సీన్ (The Raja Saab Leaked Scene) అంటూ ఈ వీడియోను నెటిజన్లు బాగా వైరల్ చేస్తున్నారు. అయితే ఇది నిజంగా ప్రభాస్ మూవీ నుంచి లీకైన సీనా.. లేక వేరే చిత్రానికి సంబంధించినదా అనేది మాత్రం తెలియలేదు. దీనిపై ఇటు రాజా సాబ్ టీమ్ గానీ.. అటు ఆ వీడియోకు సంబంధించిన చిత్రబృందం గానీ క్లారిటీ ఇవ్వలేదు. ఇక రాజా సాబ్ మూవీకి గతంలోనూ లీకుల బెడద ఎదురైన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ స్పాట్ లో ప్రభాస్ ఉన్న ఫొటో ఒకటి అప్పట్లో రివీల్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
డ్యూయెల్ రోల్ లో ప్రభాస్
ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్స్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ (SS Thaman) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ ఐటమ్ పాటకు ప్రభాస్ డ్యాన్స్ ఉంటుందని ఇటీవలే మరింత హైప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
#TheRajaSaab shooting is progressing rapidly with continuous day and night schedules. Nearly 80% of the shoot has been completed, and post production work is in full swing
We’ve noticed various speculations circulating about the teaser release during Christmas or New Year. We… pic.twitter.com/qJIX2AXxDh
— People Media Factory (@peoplemediafcy) December 18, 2024






