మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో వస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘కన్నప్ప’ (Kannappa). ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి పరమేశ్వరుడికి ప్రీతి పాత్రమైనందున ప్రతి సోమవారం ఒక్కో పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే తాజాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శివయ్య (Lord Shiva) పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో పరమేశ్వరుడి పాత్రలో బాలీవుడ్ కిలాడీ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే.
శివుడి పాత్రలో అక్షయ్ కుమార్
తాజాగా ఈ సినిమా నుంచి అక్షయ్ కుమార్ (Akshay Kumar) పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ షేర్ చేశారు. ‘ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు.. భక్తికి మాత్రం దాసుడు’ అంటూ ఈ పాత్రను పరిచయం చేశారు. ఈ పోస్టర్ లో అక్షయ్ కుమార్ శివుడి రూపంలో కనిపించారు. ఒక చేతిలో త్రిశూలం పట్టుకుని దాన్ని విసిరేస్తున్నట్టుగా.. మరో చేతిలో డమరుకంతో ఈ పోస్టర్ లో అక్షయ్ కుమార్ ను చూడొచ్చు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
ॐ The Eternal Protector ॐ
Unveiling @akshaykumar as *𝐋𝐨𝐫𝐝 𝐒𝐡𝐢𝐯𝐚’🔱, a captivating presence of divinity, power, and serenity in #Kannappa🏹.✨
Dive into the ageless story of unwavering love, devotion, and sacrifice.
Experience the grandeur on the big screen this April… pic.twitter.com/CQlB89EaDQ
— Kannappa The Movie (@kannappamovie) January 20, 2025
నందిగా ప్రభాస్
ఇక ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా యువరాణి నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇటీవలే ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. భారీ బడ్జెట్, అత్యున్నత టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ సినిమా శివపార్వతులుగా ప్రభాస్-నయనతార కనిపించనున్నారనే టాక్ వినిపించింది. కానీ తాజాగా అక్షయ్ కుమార్-కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) శివపార్వతులుగా కనిపించనున్నట్లు విడుదలైన పోస్టర్లు చూస్తే తెలుస్తోంది. అయితే ప్రభాస్ నంది పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
🌟 Divine Grace Personified 🌟
Here is the glorious full look of @MsKajalAggarwal as ‘𝐌𝐀𝐀 𝐏𝐚𝐫𝐯𝐚𝐭𝐢 𝐃𝐞𝐯𝐢’🪷 the divine union with ‘𝐋𝐨𝐫𝐝 𝐒𝐡𝐢𝐯𝐚’🔱, in #Kannappa🏹. Witness her ethereal beauty and the divine presence, she brings to life in this epic tale of… pic.twitter.com/EvEgx3GDWY
— Kannappa The Movie (@kannappamovie) January 6, 2025
అగ్రతారలతో కన్నప్ప
మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ (Shiva Raj Kumar), ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంచు మోహన్ బాబు కూడా కీలక పాత్రలో సందడి చేయనున్నారు. మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు పిల్లలయిన అరియానా, వివియానా, అవ్రామ్ ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. వీరి పాత్రలకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు.
Stepping into the sacred aura of Mahadev for #Kannappa🏹. Honored to bring this epic tale to life. May Lord Shiva guide us on this divine journey. Om Namah Shivaya!#LordShivaॐ #HarHarMahadevॐ pic.twitter.com/OclB6u18TH
— Akshay Kumar (@akshaykumar) January 20, 2025






