బిగ్‌బాస్‌ హోస్టింగ్‌కు స్టార్‌హీరో గుడ్‌ బై

ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్‌ (Bigg Boss) వివిధ భాషల్లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో ఆయా సినిమా ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు ఈ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే హిందీ బిగ్ బాస్ కు మాత్రం సల్మాన్ ఖాన్ ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగుతోంది. మరోవైపు ‘బిగ్‌బాస్‌ కన్నడ’కు అక్కడి స్టార్‌ హీరో సుదీప్‌ (Kichcha Sudeep) హోస్టుగా చేస్తున్న విషయం తెలిసిందే. 11 సీజన్ల నుంచి హోస్ట్‌గా అలరిస్తున్న ఆయన తాజాగా ఆ షోకు గుడ్ బై చెప్పారు.

ఇకపై హోస్టుగా చేయను

ఇప్పటికే బిగ్ బాస్ షో (Bigg Boss Kannada)కు హోస్టు చేయనని ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించనని చెప్పిన విషయం తెలిసిందే. ఇకపై తాను ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా చేయనని మరోసారి వెల్లడించారు. రానున్న గ్రాండ్‌ ఫినాలే తర్వాత తాను ఈ కార్యక్రమంలో హోస్టుగా కనిపించనని పేర్కొంటూ తాజాగా ఎక్స్‌ వేదికగా ఆయన ఓ పోస్ట్‌ షేర్ చేశారు. అయితే తాను ఎంతగా ప్రయత్నించా కన్నడ బిగ్ బాస్ కు మిగతా భాషల్లో వచ్చినంత ఫేమ్, పాపులారిటీ రావడం లేదని ఆయన చెప్పిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ షోకు గుడ్ బై

‘‘11 సీజన్ల నుంచి నేను బిగ్ బాస్ షోను చాలా ఎంజాయ్ చేశాను. ఈ షోకు హోస్ట్‌గా చేసిన నాపై మీరు చూపిన అభిమానానికి చాలా ధన్యవాదాలు. త్వరలో జరగనున్న ఫినాలేతో హోస్ట్‌గా నా ప్రయాణం ముగియనుంది. ఈ షోకు హోస్టుగానేను మీ అందరికీ సరిపడా వినోదాన్ని అందించానని భావిస్తున్నాను. ఇది ఎప్పటికీ మర్చిపోలేని జర్నీ. నాకు సాధ్యమైనంతవరకూ ఉన్నతంగా కొనసాగించాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని కిచ్చా సుదీప్ గుడ్ బై పోస్టు షేర్ చేశారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *