హైదరాబాద్: మంత్రి హరీష్ రావు పై మల్కాజిగిరి MLA మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేసి BRS పై తిరుగుబాటు స్వరం పెంచి KCR కి హీట్ పెంచారు. శుక్రవారం BRS పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాశారు.
మల్కాజిగిరి మల్లారెడ్డి అల్లుడుతో పాటు మరో వ్యక్తి బరిలోకి దించేందుకు KCR, KTR కసరత్తు చేస్తున్నారు. కానీ ఉప్పల్ టిక్కెట్ ఆశించి భంగపడిన మాజీ మేయర్ సైతం మల్కాజిగిరి టిక్కెట్ కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే మల్కాజిగిరి హస్తం చేతిలోనే ఉంది. ఈ సారి అసెంబ్లీ సైతం మైనంపల్లికి టిక్కెట్ ఇచ్చి చేతి బలం పెంచుకోవాలని రేవంత్ రెడ్డి ముందు నుంచే వ్యూహం వేశారని సమాచారం.
అధికార పార్టీ మాత్రం మైనంపల్లికి పోటీగా బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపాలని భావించింది. సీఎం కెసిఆర్ నే ఏకంగా ప్రత్యేక దృష్టి సారించారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ని బరిలోకి దించాలని BRS ఫిక్స్ అయిందని సమాచారం.
కానీ ఇక్కడ మాత్రం BRS పార్టీ కార్యకర్తలు మైనంపల్లి వెంటే నడిచేందుకు సిద్దం అయ్యారు. మల్కాజిగిరి ప్రజలు మాత్రం జెండాలతో సంబధం లేకుండా మైనంపల్లి గెలుపుకు పట్టం కట్టేందుకు సిద్దం అయ్యారని మైనంపల్లి వర్గీయులకి ప్రజలు ఇస్తున్న నమ్మకంగా పేర్కొంటున్నారు.