
కోలీవుడ్ దళపతి విజయ్ (Vijay) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే (Pooja Hegde) మమిత బైజు హీరోయిన్లు. అయితే జన నాయగన్ ఏ విజయ్ చివరి సినిమా అని.. ఈ మూవీ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితం కానున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇదే ప్రశ్నను తాను విజయ్‌ని ఓ సందర్భంలో అడిగినట్లు మమితా బైజు (Mamitha Baiju) తెలిపారు. దానికి ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారని అన్నారు.
‘ஜனநாயகன்’தான் கடைசி படமா என நடிகர் விஜயிடம் கேட்ட நடிகை மமிதா பைஜூ..விஜய் கூறிய பதில்!
. BREAKING_NEWS
👇Follow_chennal👇
. 24/7 Hot Newshttps://t.co/qocnD5NEAC
👇https://t.co/SKpnf9VoxD#mamithabaiju #actorvijay #tvkvijay #thalapthyvijay #asiavilletamil pic.twitter.com/L2ZqMVgAyb— Tamil Nadu News 24/7 (@tamil_nadu_news) June 23, 2025
‘‘జన నాయగన్’ షూటింగ్ సమయంలో ఇదే మీ చివరి సినిమానా అని విజయ్‌ను అడిగా. ‘ఆ విషయం ఇప్పుడే చెప్పలేను. అది 2026 ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది’ అని ఆయన నాతో అన్నారు. సినిమా షూటింగ్ అంతా సరదాగా గడిచింది. చిత్రీకరణ చివరి రోజు నాతో పాటు అందరూ ఎమోషన్ అయ్యారు. విజయ్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. అందుకే టీమ్‌తో కలిసి ఫొటోలు కూడా దిగలేకపోయారు’ అని మమితా చెప్పారు. ఇందులో తన పాత్ర గురించి మాత్రం ఇప్పుడే చెప్పనని స్క్రీన్‌పై చూడాలన్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియమణి, గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.