అఖిల్ అక్కినేని(Akhil Akkineni).. తాత నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున, అన్న నాగచైతన్య తరహాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేకపోయాడు. 1994లోనే బాల నటుడిగా సిసింద్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అఖిల్.. హీరోగా లీడ్ చేసిన మూవీలు మాత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. తొలుత మనం సినిమాలో అక్కినేని హీరోలందరూ కనిపించగా ఆ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. కానీ ఆతర్వాత సీన్ రివర్స్ అయింది.
దాదాపు అన్ని సినిమాల పరిస్థితి అంతే..
ఈ యంగ్ హీరో సోలోగా చేసిన మూవీలు అఖిల్, ఆటాడుకుందం రా, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తదితర చిత్రాలు అఖిల్‌కు అనుకున్న సక్సెస్‌ను అందించలేదు. దీంతో APRIL 28, 2023లో స్పై యాక్షన్ మూవీగా “ఏజెంట్ (AGENT)”మూవీ చేశాడు అఖిల్.. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఎంతలా అంటే ఈ మూవీని OTTటీలో రిలీజ్ చేయాలంటే మేకర్స్ ఆలోచించేంతగా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన ‘ఏజెంట్’ మూవీ సోనీ లివ్(Sony Liv)లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఆకట్టుకున్న మలయాళ సూపర్ స్టార్లు
‘ఏజెంట్’ చిత్రంలో అఖిల్ అక్కినేనితో పాటు మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, డెంజిల్ స్మిత్, విక్రమ్‌జీత్ విర్క్ తదితరులు నటించారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందించిన కథకు దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాకు స్క్రీన్‌ప్లేను కూడా రచించారు. AK ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి దాదాపు 2 ఏళ్ల తర్వాత OTTలోకి రానున్న ఈ మూవీ అభిమానులను ఏ మేర ఆకట్టుకుంటుందో..






