
టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో మోహన్ బాబుపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అసలు కేసు ఏంటంటే?
జల్‌పల్లిలోని మోహన్ బాబు (Mohan Babu Case) నివాసం వద్ద మీడియా ప్రతినిధిపై దాడి చేయడంపై పహాడీషరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొదట ఆయనపై బీఎన్‌ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన అధికారులు.. అనంతరం 109 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి.. హత్యాయత్నం కేసు పెట్టారు.
క్షమించండి
ఇక తన దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్‌కు మోహన్ బాబు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. దాదాపు 30 నుంచి 50 మంది వ్యక్తులు ఇంట్లోకి చొచ్చుకొచ్చారని.. ఆ సమయంలో సహనాన్ని కోల్పోయినట్లు ఈ మేరకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. పరిస్థితి అదుపు చేసే క్రమంలో జర్నలిస్ట్‌కు గాయమైందని.. ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. అతడికి, ఆయన కుటుంబానికి కలిగిన బాధకు తాను తీవ్రంగా చింతిస్తున్నట్లు చెప్పారు.