
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ది మోస్ట్ పాపులర్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB). ఈ జట్టులో కింగ్ కోహ్లీ(Kohli) ఉండటంతోనే ఆ ఫ్రాంచైజీకి అంత పాపులారిటీ వచ్చిందనేది కాదనలేని నిజం. అయితే ఏటా IPL సీజన్ రావడం ‘‘ఈ సాల కమ్ నమ్ దే’’ అంటూ సోషల్ మీడియా(SM)లో హంగామా చేయడమే తప్ప ఇప్పటి వరకూ ఆ జట్టు ఒక్కసారి కూడా కప్ కొట్టిన సందర్భం లేదు. దీంతో ప్రతి సీజన్‌కు జట్టు మేనేజ్మెంట్ చేయని ప్రయత్నాలు లేవు. మార్చని ప్లేయర్లూ లేరు. కోచింగ్ సిబ్బంది లేరు. ఇలా ఎన్ని మార్పులు వచ్చినా ఆ జట్టుకు మాత్రం IPL TROPHY కలగానే మిగిలిపోతోంది. దీంతో ఈ సీజన్-2025కి జట్టులో చాలా మార్పులు చేసింది తాజాగా కొత్త కెప్టెన్(New Captain)ను ఎంపిక చేసింది.
🚨 BREAKING 🇮🇳: WELCOME RAJAT PATIDAR AS THE NEW CAPTAIN OF ROYAL CHALLENGERS BENGALURU !! 👏🎉 #RCB #RajatPatidar #RCBCaptain #Rajat #IPL2025 #RCBCaptainYaaru #RaPa #ViratKohli #IPL pic.twitter.com/DvZQSsZCZz pic.twitter.com/JN6dXiUTqh
— In Bulletin (@inbulletinnews) February 13, 2025
కెప్టెన్సీపై కోహ్లీ ఆసక్తి చూపించకపోవడంతో..
IPL ఫ్రాంచైజీ RCBకి 2021 సీజన్ నుంచి కీలక ప్లేయర్‌గా ఉన్న యువ ఆటగాడు రజత్ పాటీదార్(Rajat Patidar)ను RCB కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గత సీజన్ వరకు కెప్టెన్‌గా ఉన్న దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Duplessis)ను ఈసారి RCB వేలంలో వదిలేసిన విషయం తెలిసిందే. దాంతో RCB పగ్గాలు తిరిగి విరాట్ కోహ్లీ(Virat Kohli) చేపడతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అతడు కెప్టెన్సీపై ఆసక్తి చూపించకపోవడంతో ఆ బాధ్యతలు రజత్‌కు అప్పగించింది. కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ రేసులో నిలిచినప్పటికీ జట్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా రజత్‌కే కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా పాటీదార్ ఆర్సీబీ తరఫున 27 మ్యాచుల్లో బరిలోకి దిగాడు. మొత్తం 799 రన్స్ చేయగా ఇందులో ఓ శతకం సహా 7 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. దీంతో కొత్త కెప్టెన్ హయాంలోనైనా ఆ జట్టు కప్పు కొట్టాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.
A new chapter begins! 🤩
𝐑𝐚𝐣𝐚𝐭 𝐏𝐚𝐭𝐢𝐝𝐚𝐫 – The Royal Challengers Bengaluru have a new Captain! 🙌🔥
Here’s wishing him success on this incredible journey! ❤#RCB #RoyalChallengersBengaluru #IPL2025 pic.twitter.com/Ej7AYx4qlZ
— Star Sports (@StarSportsIndia) February 13, 2025