
ప్రజెంట్ ఇండియాలో BJP హవా నడుస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు(Elections) వచ్చినా కమలం పార్టీ జెండా రెపరెపలాడుతోంది. ఇప్పటికే మోదీ(NAMO) హయాంలో ఆ పార్టీ ఎదురు లేకుండా దూసుకుపోతోంది. రికార్డు స్థాయిలో మూడో సారి గెలిచి వరుసగా మూడోసారి ప్రధాని(PM)గా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందనే దానిపై ‘ఇండియా టుడే సీ ఓటర్ సర్వే(India Today C Voter survey)’ నిర్వహించింది. ఈ సర్వేలో షాకింగ్ ఫలితాలు(Results) వెలుగు చూశాయి.
బీజేపీకి ఒంటరిగానే 281 సీట్లు
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి BJP నేతృత్వంలోని NDA అధికారంలో వస్తుందని తేలింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు. ప్రస్తుతం NDAకు 284 స్థానాలే ఉన్నాయి. ఇస్ బార్ చార్ సౌ పార్ అంటూ బరిలో దిగిన BJP కేవలం 240 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 232 సీట్లు గెల్చుకుంది. “ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్” పేరుతో ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి 188 స్థానాలకు పడిపోనుంది. అటు BJP 281 సీట్లు సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 78 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది.
2024 ఎన్నికల తర్వాత పుంజుకున్న బీజేపీ
కాగా దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాల నుంచి 1,25,123 మంది ఓటర్ల అభిప్రాయాలు సేకరించారు. జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 9 వరకూ సేకరించిన అభిప్రాయాలివి. వాస్తవానికి 2024 ఎన్నికల్లో BJP అంతగా రాణించలేకపోయినా ఆ తరువాత వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకుంది. మహారాష్ట్ర, హరియాణా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ పరిణామాల్లో ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే బీజేపీ మరోసారి అధికారం ఖాయమంటోంది ఈ సర్వే.