ప్రభాస్, మోహన్ బాబు ఓ ‘ముక్కు కథ’.. వీడియో వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ఆరు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. మరోవైపు ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప (Kannappa)’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ (Kajal Agrwal), శరత్ కుమార్, ప్రీతి ముకుందన్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ కానుంది.

ప్రభాస్, మోహన్ బాబు ఫన్నీ వీడియో

ఈ నేపథ్యంలో ‘కన్నప్ప’ టీమ్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగానే ఇందులో నటిస్తున్న మోహన్ బాబు (Mohan Babu), ప్రభాస్ కు సంబంధించిన ఓ ఓల్డ్ ఫన్నీ వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇందులో ప్రభాస్, మోహన్ బాబు తమ ముక్కు గురించి ఫన్నీగా సంభాషించుకున్నారు. ‘నా ముక్కు షార్ప్ అంటే నా ముక్కు షార్ప్’ అంటూ ఇద్దరు నటులు ఒకరినొకరు ఆటపట్టించుకున్నారు.

నా ముక్కు షార్ప్ మరి నీది

“నీ ముక్కు షార్ప్ కాదు నా ముక్కే షార్ప్. నేను చిన్నప్పుడు నా ముక్కుతో టమాటాలు కోశాను. నువ్వు నీ ముక్కుతో టమాటాలు కోశావా. చూశావా నా ముక్కే షార్ప్” అంటూ ప్రభాస్ మోహన్ బాబును ఆటపట్టించాడు. ఈ విషయాన్ని మళ్లీ చెప్పు అంటూ మంచు విష్ణు (Manchu Vishnu) ఈ ఫన్నీ సంభాషణను వీడియో తీశాడు. ఆ వీడియోను నెట్టింట షేర్ చేశాడు. మా డార్లింగ్ చాలా చిలిపి అంటూ ఈ వీడియో చూసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన డార్లింగ్ ఫ్యాన్స్ దాన్ని వైరల్ చేసేస్తుంటారు. ఇప్పుడు ఈ వీడియోను కూడా నెట్టింట బాగా వైరల్ చేస్తున్నారు.

డార్లింగ్ చిలిపి చేష్టలు

ప్రభాస్‌, మంచు మోహన్‌బాబు మధ్య స్ట్రాంగ్ రిలేషన్ షిప్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు బుజ్జిగాడు (Bujjigadu) సినిమాలో కలిసి పని చేశారు. అందులో హీరోయిన్ కు అన్నగా నటించాడు మోహన్ బాబు. అప్పటి నుంచి ప్రభాస్ మోహన్ బాబును బావా అని పిలుస్తున్నాడు. సినిమాలోనే కాదు బయట కూడా అలాగే పిలవడం కంటిన్యూ చేశాడు. ఇలా ఈ ఇద్దరు ఎప్పుడు కలిసినా ఇలా ఫన్నీగా ముచ్చట పెడుతుంటారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *