Mana Enadu : రైలు ప్రయాణికులకు అలర్ట్. ఈనెల 16వ తేదీ (సోమవారం) నుంచి 27వ తేదీ వరకు పలు రైళ్లు (Trains Cancel) రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని గుంతకల్లు రైల్వే డీఆర్ఎం విజయ్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాలను గమనించి.. తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. పాణ్యం, బుగ్గనపల్లె, కృష్ణమ్మ కోన రైల్వే లైన్‌లో జరుగుతున్న డబ్లింగ్ పనుల (Dubling Works)కారణంగా రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేస్తున్నట్లు వెల్లడించారు.
రద్దయిన రైళ్ల వివరాలు ఇవే
గుంటూరు-డోన్ (17228), డోన్-గుంటూరు (17227) రైలు రద్దు చేసినట్లు గుంతకల్లు డీఆర్ఎం విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 20వ తేదీన పూరి- యశ్వంతపూర్ (22883), 21వ తేదీన యశ్వంతపూర్ – పూరి (22884) రైలు దారి మళ్లించినట్టు వెల్లడించారు. ఈ నెల 18, 25వ తేదీల్లో హౌరా – యశ్వంతపూర్ (22831) రైలును నంద్యాల, ఎర్రగుంట్ల, గుత్తి, అనంతరపురం మీదుగా దారి మళ్లించి నడుపుతున్నట్లు చెప్పారు.
ప్రయాణికులకు విజ్ఞప్తి
ఈ నెల 20వ తేదీన యశ్వంతపూర్ – హౌరా ( 22832) రైలును అనంతపురం, గుత్తి, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా దారి మళ్లించి నడుపుతున్నట్లు విజయ్ కుమార్ చెప్పారు. అలాగే గుంటూరు-ఔరంగాబాద్ (17253), ఔరంగాబాద్ – గుంటూరు (17254) రైలు ప్రతి రోజు మధ్యాహ్నం రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాలను గమనించి తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు.








