రండి బాబు రండి.. రూ.4లకే చికెన్‌ బిర్యానీ.. అదిరిపోయే ఆఫర్

Mana Enadu : ‘రండి బాబు రండి.. రూ.4లకే చికెన్ బిర్యానీ (Chicken BIryani). ఈ అదిరిపోయే ఆఫర్ ఇవాళ ఒక్కరోజు మాత్రమే. త్వరపడండి.. రుచికరమైన చికెన్ బిర్యానీనీ హాయిగా ఆస్వాదిస్తూ ఆరగించండి. ఆహా.. అంటూ లొట్టలేసుకుంటూ భుజించండి.’ ఇదేంటి రూ.4లకే చికెన్ బిర్యానీయా?.. అంత తక్కువ రేటుకు బిర్యానీ అంటే ఆలోచించాల్సిందే అనుకుంటున్నారా?

మీరేం ఆలోచించనక్కర్లేదు. ఎందుకంటే ఈ బంపర్ ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే. ఎందుకంటే..?రెస్టారెంట్ ప్రారంభమైన రోజును పురస్కరించుకుని ఓ హోటల్ యజమాని కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ ఆఫర్ పెట్టాడు. ఇంకేం.. ఆఫర్ గురించి తెలియగానే వందల సంఖ్యలో ఆ రెస్టారెంటు వద్ద బారులు తీరారు. ఇంతకీ అదెక్కడంటే..?

ఏపీలోని అనకాపల్లిలో హోటల్​ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులు ఓ క్రేజీ ఆఫర్ ప్రకటించారు. తమ రెస్టారెంటుకు కస్టమర్లను ఆకర్షించేందుకు రూ.4కే చికెన్ బిర్యానీ (Rs.4 Chicken BIryani) అని ఓ బంపర్ ఆఫర్ బిర్యానీ లవర్స్ ముందుకు తీసుకొచ్చారు. ఇంకేముంది ఈ ఆఫర్ గురించి తెలిసి ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. బిర్యానీ తినేందుకు రెస్టారెంటు వద్ద భారీ సంఖ్యలో బారులు తీరారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కొనుగోలుదారులు ఆ హోటల్ వాహనాలు పార్క్ చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నర్సీపట్నం (Narsipatnam)లో రహదారులు, భవనాల శాఖ అతిథి గృహానికి సమీపంలో ఆదివారం రోజున ఓ హోటల్‌ ప్రారంభోత్సరం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆదివారం ఒక్క రోజే.. రూ. 4కే చికెన్‌ బిర్యానీ ప్యాకెట్‌ ఆఫర్‌ ప్రకటించారు. ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న వారు భారీగా తరలివచ్చారు. అయితే ఒక్కరికి ఒక బిర్యానీ ప్యాకెట్ మాత్రమే అందించారు.

దీంతో చాలా మంది తమ కుటుంబ సభ్యులతో సహా క్యూలో నిల్చుకున్నారు. కొందరైతే చిన్న పిల్లలను కూడా దాదాపు రెండు గంటలపాటు క్యూలో నిల్చోబెట్టారు. ఇక భారీగా జనం తరలిరావడం.. వాహనాల పార్కింగ్ వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడటంతో పోలీసులు రంగంలోకి దిగి రద్దీ క్లియర్ చేశారు. దాదాపు మూడు వేల మందికి పైగా బిర్యానీ ప్యాకెట్లు విక్రయించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *