Maxwell-Klassen: ఇంటర్నేషనల్ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ల వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో స్టార్ క్రికెటర్లు అందరూ ఒక్కొక్కరుగా తమ ప్రొఫెషనల్ గేమ్‌కు వీడ్కోలు పలుకుతున్నారు. మొన్న టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన అభిమానులకు షాకిచ్చారు. తాజాగా ఈ జాబితాలోకి పలువురు స్టార్ క్రికెటర్లు చేరారు. సోమవారం (జూన్ 2)న ఆస్ట్రేలియా విధ్వంసక ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్(Glenn Maxwell) వెల్ ODIలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. మ్యాక్సీ ఆస్ట్రేలియా తరఫున 149 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. 3,990 రన్స్ చేశాడు. ఇందులో ఓ భారీ డబుల్ సెంచరీ(201*) కూడా ఉంది. అయితే టీ20 క్రికెట్లో మాత్రం కొనసాగుతానని అతడు క్లారిటీ ఇచ్చాడు. కాగా మ్యాక్స్‌వెల్ టెస్టు క్రికెట్లో చోటు కోసం కష్టపడుతున్నాడు. అతడు 2017లో బంగ్లాదేశ్‌(Bangladesh)పై తన చివరి టెస్టు ఆడాడు. టెస్టు క్రికెట్‌ కెరీర్‌పై ఆయన స్పందించలేదు.

కాటేరమ్మ పెద్దకొడుకు కూడా

ఇదిలా ఉండగా మ్యాక్స్ వెల్ రిటెర్మెంట్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే దక్షిణాఫ్రికా(South Africa) విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klassen) అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల(All Formats) నుంచి రిటైర్మెంట్(Retirement) ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 33 ఏళ్ల వయసులోనే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం అభిమానులను, క్రికెట్ విశ్లేషకులను నిరాశకు గురి చేసింది. IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తరపున ఆడే క్లాసెన్, తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఎంతో ఇష్టమైన ఆటగాడిగా పేరుగాంచాడు. క్లాసెన్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. తన ఏడేళ్ల కెరీర్‌లో దక్షిణాఫ్రికా తరపున కీలక పాత్ర పోషించాడు. అతను 4 టెస్టులు, 60 ODIలు, 58 T20 మ్యాచ్‌లు ఆడాడు.

 

View this post on Instagram

 

A post shared by Heinrich Klaasen (@heinie45)

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *