నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్‌ మొదటి వారంలో మెగా డీఎస్సీ

నిరుద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీపికబురు అందించారు. ఏప్రిల్‌ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ (AP Mega DSC) ఉంటుందని ప్రకటించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ కీలక ప్రకటన చేశారు. పాఠశాలల ప్రారంభం నాటికి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ప్రకటనపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

కలెక్టర్లు దర్పం ప్రదర్శించొద్దు

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు ఆమోదయోగ్యంగా అధికారులు పని చేయాలని సూచించారు. కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదని హితవు పలికారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు. ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుందన్న ముఖ్యమంత్రి.. కొందరు అభివృద్ధి చేస్తే.. మరికొందరు నాశనం చేస్తారని వ్యాఖ్యానించారు.

ప్రజలకు హామీ ఇచ్చాం

రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని కలెక్టర్లతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ విధానం అని తెలిపారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదని వ్యాఖ్యానించారు. సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Related Posts

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Rammohan Naidu: స్టేజీపై డ్యాన్స్‌తో ఇరగదీసిన కేంద్రమంత్రి.. వీడియో చూశారా?

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Kinjarapu Rammohan Naidu) తన బాబాయి ప్రభాకర్ రావు కుమారుడి సంగీత్‌లో డ్యాన్స్‌(Dance) చేసితో అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఈ సంగీత్ కార్యక్రమంలో ఆయన తన చలాకీతనాన్ని చాటుకున్నారు. హుషారైన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *