Mana Enadu : రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అయ్యాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఈ స్టార్ హీరో తత్వం తనని అభిమానులు డార్లింగ్ అని పిలుచుకునే చేసింది. తన నటనతో, మంచితనంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రభాస్ తన ప్రేమతో, ఫుడ్‌తో చంపేస్తారంటూ చాలా మంది సెలబ్రిటీలు చెప్పిన విషయం తెలిసిందే. ప్రభాస్‌తో షూటింగ్ అంటే సెట్లో ఇంటి భోజనం కన్ఫామ్. అలా ఇండస్ట్రీలో ప్రభాస్ ఇంటి భోజనం తినని వారుండరు.
ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డూడ్
నేడు ప్రభాస్ (Prabhas Birth Day) పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు అభిమానులు, మరోవైపు సెలబ్రిటీలు డార్లింగ్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు డార్లింగ్‌తో తమకున్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కూడా ప్రభాస్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డూడ్ అంటూ డార్లింగ్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు.
ప్రభాస్‌కు చిరు బర్త్ డే విషెస్
ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డూడ్. అతను ప్రేమించే పద్ధతి చూసి.. తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్(#Happybirthdayprabhas). లవ్‌యూ..- చిరంజీవి
ఈ ఏడాదీ బాక్సాఫీస్ బద్ధలవ్వాల్సిందే
అందరి డార్లింగ్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వ్యక్తిత్వం, అంకితభావం, వినయం ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాయి. మీరు నటుడిగానే కాకుండా మీ వ్యక్తిత్వంతో లక్షలాది మందిలో స్ఫూర్తినింపారు. ఈ ఏడాది కూడా మీరు బాక్సాఫీస్ విజయాలతో సందడి చేయాలని కోరుకుంటున్నా – ప్రశాంత్ వర్మ(Prashant Varma)
రాజాధిరాజ రాజమార్తాండ మహారాజా శ్రీ ప్రభాస్ రాజుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు – బండ్ల గణేశ్
హ్యాపీ బర్త్‌డే ప్రభాస్.. వెండితెరపై మీ అద్భుతాలు ఇలానే కొనసాగాలని కోరుకుంటూ.. ఈ ఏడాది కూడా మీ మ్యాజిక్ చూడాలని ఆసక్తిగా ఉన్నాం – బాబీ
ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి Dude!అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. Happy Birthday Darling Prabhas! 💐Wishing you Love , Happiness and Greater Glory! Have A Wonderful year ahead!🤗
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2024






