సింహాసనంపై ‘రాజాసాబ్’.. డార్లింగ్ బర్త్ డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

Mana Enadu : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో డార్లింగ్ కు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖుల నుంచి అభిమానుల వరకు నెట్టింట ఈ కల్కి స్టార్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక డార్లింగ్ జన్మదినోత్సవం సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ బర్త్ డే సర్ ప్రైజ్

ప్రభాస్-డైరెక్టర్ మారుతి కాంబోలో ‘ది రాజాసాబ్‌’ (The RajaSaab) సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ పుట్టిన రోజున (అక్టోబర్ 23వ తేదీ) రాజాసాబ్ నుంచి అదిరిపోయే అప్డేట్ వస్తుందని మేకర్స్ చాలా రోజుల నుంచి ఊరిస్తూ వస్తున్నారు. ఇక తాజాగా ఈ సర్ ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ .. స్పెషల్‌ వీడియోతో మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

ది రాజాసాబ్ మోషన్ పోస్టర్

ఈ వీడియోలో ప్రభాస్‌ సింహాసనం మీద రాజసంగా కూర్చొని ఓ చేతిలో సిగార్‌తో రాజు లుక్‌లో కనిపించాడు. ప్రభాస్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. హారర్‌, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో  మాళవికా మోహనన్‌(Malavika Mohanan), నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ప్రభాస్‌ పుట్టినరోజు నుంచి తరచుగా అప్‌డేట్స్ ఉంటాయని ఇటీవల నిర్మాత చెప్పిన విషయం తెలిసిందే. 

ఏప్రిల్ 10న రాజాసాబ్ రిలీజ్

ఇటీవలే ప్రభాస్‌(Prabhas Raja Saab Movie) లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చెక్స్ షర్ట్ వేసుకున్న ప్రభాస్.. కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ కనిపించాడు. ఆ అంచనాలకు తగ్గట్లే తాజాగా విడుదలైన వీడియో ఆకట్టుకుంటోంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఏచ్చే ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీన రిలీజ్ కాబోతోంది.

Share post:

లేటెస్ట్